ఆధ్యాత్మికం

మీ ఇంట్లో గులాబీ పువ్వుల‌ను ఇలా పెట్టండి.. ల‌క్ష్మీదేవి ఎల్ల‌ప్పుడూ కొలువై ఉంటుంది..

ఈ మధ్య కాలంలో చాలా మంది ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతూ ఉన్నారు.ఎన్నో రకాల సమస్యలతో భాధ పడుతున్నారు..కుటుంబ సమస్యలతోపాటు గొడవలు, వివాదాల్లో చిక్కుకుంటున్నారు.అనారోగ్య సమస్యలు కూడా అనేక మందిని ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. అయితే ఇందుకు ఇంట్లో వాస్తు దోషాలు, నెగెటివ్ ఎనర్జీ కూడా కారణమవుతాయి. ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ లేదా వాస్తు దోషాలు ఉంటే అన్నీ సమస్యలే వస్తుంటాయి. ఎవరైనా సరే చాలా సమస్యలతో ఇబ్బందులు పడుతుంటే వారి ఇంట్లో వాస్తు దోషాలు ఉన్నాయని.. నెగెటివ్ ఎనర్జీ ఉందని అర్థం చేసుకోవాలి. దీన్ని తొలగించుకునేందుకు ప్రయత్నం చేయాలి.అప్పుడే ఎటువంటి చికాకులు ఉండవు..

పాజిటివ్ ఎనర్జీ వచ్చేలా చేయడంలో గులాబీ పువ్వులు ఎంతగానో దోహదపడతాయని చెప్పవచ్చు..గులాబీల రంగు మనసును ఆహ్లాదకరంగా ఉంచుతుంది.ఎర్రని గులాబీలు మనుషుల మూడ్ ను మారుస్తాయి.ఎరుపు రంగు గులాబీ పువ్వులనే తీసుకోవాలి. వాటిని తెంపి పక్కన పెట్టాలి. ఇప్పుడు ఒక గాజు పాత్ర తీసుకుని శుభ్రంగా కడిగి మంచినీళ్లను పోయాలి. అందులో గులాబీ పువ్వుల రెక్కలను తెంపి వేయాలి. నీరు కనపడకుండా ఉండేలా పాత్ర మొత్తం నీటిపై పువ్వులను విస్తరించాలి. తరువాత ఆ పాత్రను ఇంట్లో గాలి బాగా వచ్చే చోట పెట్టాలి.

put rose flowers like this in your home for wealth

ఇంట్లో హాల్‌లో ఏదైనా టేబుల్ మీద లేదా కిటికీ వద్ద ఇలా గులాబీ పువ్వులను నింపిన గాజు పాత్రను ఉంచాలి. దీంతో బయటి నుంచి వచ్చే గాలికి ఆ గులాబీ పువ్వుల పరిమళం తోడవుతుంది. ఇది ఇల్లంతా వ్యాప్తి చెందుతుంది. దీంతో ఇంట్లో ఉండే నెగెటివ్ ఎనర్జీ, వాస్తు దోషాలు మొత్తం పోతాయి. ఫలితంగా పాజిటివ్ ఎనర్జీ పెరిగి ఇంట్లో ఉండే వారికి అన్ని సమస్యలు తొలగిపోతాయి. అనారోగ్య, ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. అయితే ఇలా కేవలం ఒక్క రోజు మాత్రమే కాదు.. రోజూ చేయాల్సి ఉంటుంది. ఏ రోజుకారోజు పాత్రను కడిగి అందులో మంచినీళ్లను పోసి మళ్లీ అందులో గులాబీ రేకులను ఉంచాలి..అలా క్రమం తప్పకుండా చేస్తే ఇంట్లోకి లక్ష్మీదేవి రావడం తో పాటు సుఖ శాంతుల తో వెలిగిపోతుంది..

Admin

Recent Posts