హిందూ సాంప్రదాయంలో అనేక ఆచార వ్యవహారాలు అమలులో ఉన్నాయన్న సంగతి తెలిసిందే. పురాతన కాలం నుంచి హిందువులు వాటిని పాటిస్తూ వస్తున్నారు. ప్రధానంగా దేవుళ్లకు పూజ చేసే విషయానికి వస్తే దీపం, అగర్‌బత్తి వెలిగించడం, కర్పూరంతో హారతి ఇవ్వడం మామూలే. అయితే ఇలా చేసే ప్రతి పని వెనుక సైంటిఫిక్ కారణాలే దాగున్నాయని గతంలో కూడా మనం చూశాం. వాటి గురించి తెలుసుకున్నాం. మరి కర్పూర హారతి ఇవ్వడంలో ఎలాంటి సైంటిఫిక్ కారణాలు ఉన్నాయి..? దాంతో మనకు ఏ లాభమైనా కలుగుతుందా..? కలిగితే అది ఏమిటి..? అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
సినామోమమ్ కంఫోరా అనే వృక్షం నుంచి తీసే పదార్థంతో కర్పూరం తయారు చేస్తారు. అయితే దీన్ని హిందువులు ఎక్కువగా పూజల్లో ఉపయోగిస్తారు. ఆ సమయంలో హారతిలా కర్పూరాన్ని వెలిగించి దాంతో దేవుడికి హారతి ఇస్తారు. ఆ సమయంలో పొగ కూడా ఎక్కువే వస్తుంది. అయితే అలా వచ్చే పొగను పీల్చడం వల్ల మనకు ఎన్నో రకాల ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయట. కర్పూరాన్ని వెలిగించడం వల్ల వచ్చే పొగతో ఆస్తమా, టైఫాయిడ్, తట్టు, ఆందోళన, తత్తరపాటు, హిస్టీరియా, కీళ్ల నొప్పులు వంటి సమస్యలు తొలగిపోతాయట. ఆ పొగ వల్ల చుట్టూ వాతావరణంలో ఉండే బాక్టీరియా, క్రిములు, వైరస్‌లు నాశనమవుతాయట.
జ్ఞాపకశక్తి వృద్ధి చెందుతుందట. చర్మ సంబంధ సమస్యలు తొలగిపోతాయట. కర్పూరం వాసన కొందరికి పడదట. కానీ కర్పూరం వాసనను స్వర్గానికి చెందినదిగా అభివర్ణిస్తారు. దీన్ని మండిస్తే ఎలాంటి బూడిద రాకుండా పూర్తిగా మండిపోతుంది. అందుకే దీన్ని దేవుళ్లకు పూజలు చేయడంలో వినియోగిస్తారట. కర్పూరాన్ని వెలిగిస్తే అది ఎలాగైతే పూర్తిగా మండిపోతుందో అలాగే దానికి ఎదురుగా నిలబడి పూజ చేసిన వారిలో ఉన్న ఈగో కూడా అలాగే మండిపోతుందట. ఈ క్రమంలో అలాంటి వారు పరిశుద్ధులవుతారట. కర్పూరాన్ని వెలిగించడం వల్ల దాని చుట్టూ ఉన్న వాతావరణంలో పాజిటివ్ ఎనర్జీ వస్తుందట. ఈ క్రమంలో ఆ ఎనర్జీ అంతా మనలోకి వెళ్లి మనకు అంతా మంచే జరుగుతుందట.