ఆధ్యాత్మికం

Soma Scanda Murthy : పిల్ల‌లు లేని వారు ఈ ఫొటోను ఇంట్లో పెట్టుకుంటే.. సంతానం క‌లుగుతుంది..!

Soma Scanda Murthy : ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఏదో ఒక సమస్య అనేది ఉంటుంది. చాలా మంది ఇళ్లల్లో అనేక రకాల సమస్యలు ఉంటాయి. కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, వైవాహిక జీవితంలో సమస్యలు లేదంటే సంతానం కలగకపోవడం, ఆరోగ్యం బాగోకపోవడం ఇలా ఉంటాయి.. పెళ్లి కుదరక కూడా చాలా మంది బాధపడుతూ ఉంటారు. పెళ్లయిన తర్వాత పిల్లలు పుట్టక కూడా చాలా మంది బాధపడుతూ ఉంటారు. పెళ్లయిన వాళ్ళు పిల్లల్ని కలగాలంటే ఇలా చేయండి.

ఇలా కనుక మీరు చేశారంటే కచ్చితంగా పిల్లలు పుడతారు. ఒకవేళ మీకు పిల్లలు పుట్టి ఉన్నట్లయితే వారి తెలివితేటలు పెరగడానికి, చురుకు రావడానికి కూడా మీరు ఇలా చేయొచ్చు. మరి ఇక ఈరోజు కొన్ని ముఖ్యమైన విషయాలను తెలుసుకుందాం. సంతానం కలగక ఇబ్బంది పడే దంపతులు ఇలా పాటిస్తే సంతానం కలుగుతుంది. సంతానం కలగాలనుకునేవారు శ్రీ సోమ స్కంద మూర్తిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే సంతానం కలుగుతుంది.

Soma Scanda Murthy put this idol in home for those who do not have kids

పిల్లలు ఉన్నవాళ్లు కూడా సోమ స్కంద మూర్తిని ఆరాధిస్తే తెలివితేటలు వస్తాయి. చురుకుదనం ఉంటుంది. తేజస్సుని కూడా పొందుతారు. తమిళనాడులో సోమ స్కంద మూర్తిని తప్పకుండా ప్రతి ఒక్కరూ కొలుస్తారు. అక్కడ ప్రతి శివాలయంలో కూడా సోమ స్కంద మూర్తి ఉంటారు. మన రాష్ట్రంలో కపిలతీర్థం, శ్రీకాళహస్తి దేవాలయాల్లో సోమ స్కంద మూర్తి ఉన్నారు.

పార్వతీ పరమేశ్వరుల‌ మధ్యలో ఒక చిన్న బాలుడిగా ఆడుకుంటూ ఉంటారు సుబ్రమణ్యేశ్వర స్వామి. సోముడు అంటే శివుడు. ఉమాదేవి అంటే పార్వతి. స్కందుడు అంటే సుబ్రహ్మణ్యస్వామి. వీళ్లు ముగ్గురూ కలిసి ఉన్న మూర్తిని సోమ స్కంద మూర్తి అని అంటారు. సోమ స్కంద మూర్తిని పూజిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుంది అంటారు. కాబట్టి వివాహమై సంతానం కోసం ఎన్నో రకాలుగా ప్రయత్నం చేస్తుంటే సోమ స్కంద మూర్తిని పూజిస్తే సంతాన భాగ్యం కలుగుతుంది. దంపతులు హాయిగా పిల్లా పాపలతో కలిసి జీవించొచ్చు.

Admin

Recent Posts