Lakshmi Devi : ప్రతి ఇంట్లో కూడా కష్టాలు ఉంటాయి. కొంత మంది ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఉంటే కొంత మంది ఇంట్లో ఇతర ఇబ్బందులు ఏమైనా ఉండొచ్చు. అయితే మంచి ఆర్థిక అభివృద్ధిని ప్రసాదించే ధనాకర్షణ తంత్రము గురించి ఈరోజు తెలుసుకుందాము. రవి పుష్య యోగం లో కానీ గురు పుష్య యోగం లో కానీ ఈ తంత్రాన్ని చేయాలి. ఆదివారంనాడు పుష్యమి నక్షత్రం వస్తే రవి పుష్య యోగం అంటారు. గురువారం పుష్యమి నక్షత్రం వస్తే దానిని గురు పుష్య యోగం అని అంటారు. అయితే ఆ యోగం ఉన్న రోజు ఉదయాన్నే ఇలా చేస్తే చక్కటి ఫలితాన్ని పొందవచ్చు.
ఉత్తరేణి మొక్క దగ్గరికి వెళ్లి అవసరానికి మీరు భూమి నుండి మొక్కను తీసుకుంటున్నారని తనకి చెప్పి క్షమించమని ప్రార్థించాలి. ఆ తర్వాత మొక్కను తీసేసి చెట్టు వేరుని తెచ్చుకోవాలి. ఇంటికి తీసుకొచ్చాక గోమూత్రంతో కానీ ఆవు పాల తో కానీ శుభ్రం చేసి తర్వాత నీటి తో శుభ్రం చేయాలి. ఆ వేరు ని మీరు ఎరుపు రంగు వస్త్రం లో పెట్టి వేరుకు ధూపం చూపించాలి.
మట్టి ప్రమిది లో ఒట్టు వేసి నెయ్యి తో కానీ లేదంటే నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించి పసుపు కుంకుమ అక్షతలు వేసి పూజించాలి. ఎర్రని పుష్పాల తో పూజించాలి. తియ్యని పదార్థాన్ని నైవేద్యంగా సమర్పించాలి. పూజ పూర్తయ్యాక ఎరుపు రంగు వస్త్రంలో వేరు తో పాటుగా ఒక ఖర్జూరం, రెండు రూపాయల కాసులు వేయాలి.
తర్వాత మూట కట్టేసి ఒక సారి ధూపాన్ని చూపించండి. డబ్బులని పెట్టుకునే చోటులో కాని బీరువా లో కానీ దీనిని పెట్టాలి వ్యాపారులు క్యాష్ కౌంటర్ లో పెట్టుకోవచ్చు. ఇలా చేస్తే ధన ప్రాప్తి కలుగుతుంది. ఆర్థికంగా అభివృద్ధి చెందొచ్చు. సమస్యలు గట్టెకుతాయి.