ఆధ్యాత్మికం

పెళ్లిసమయంలో పెళ్లికూతురు చేతిలో కొబ్బరిబోండం ఎందుకో తెలుసా?

హిందూ సాంప్రదాయం ప్రకారం జరిగే పెళ్లిలో..వధువు చేతిలో కొబ్బరిబోండం ఉండడాన్ని గమనించే ఉంటారు! అసలు పెళ్లికి, కొబ్బరిబోండానికి లింక్ ఏంటి? పెళ్లిపీటల మీదకు వచ్చేటప్పుడు వధువు కొబ్బరిబోండాన్ని పట్టుకురావాల్సిన అవసరం ఏంటి? ఓన్లీ కొబ్బరిబోండమేనా? ఇంకేమైనా వస్తువులను ఇలా తీసుకువస్తారా? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం మీకోసం.

కొబ్బరిబోండాన్ని పూర్ణఫలం అంటారు. ఇది దాంపత్య జీవితం ఎలా ఉండాలో బోధిస్తుంది. భార్యభర్తల జీవితం కొనసాగుతున్నా కొద్దీ వారిమధ్య అనురాగాలు, అప్యాయతలు, ప్రేమలు పెరగాలని ప్రబోధిస్తుంది. బయటికి చూడడానికి కొబ్బరిబోండం గట్టిగా ఉన్నా..లోపల అమృంతం వంటి నీటిని కలిగి ఉంటుంది . జీవితం కూడా అలాగే ఎన్ని కష్టాలున్నా…ఆలుమగల మద్యనుండే అన్యోన్యత వల్ల కష్టాలలోనూ కొబ్బరి నీళ్ల లాంటి తీపిని ఆస్వాదించవచ్చు.

why bride carries coconut in hand

సాంప్రదాయం ప్రకారం…కన్యాధానం చేసేటప్పుడు..అలంకారాలు చేసి కన్యాధానం చేయాలి. చెవులకు కమ్మలు, ముక్కుకు ముక్కెర, మెడలో గొలుసు, చేతికి గాజులు, నడుముకు వడ్డాణం …ఇవన్నీ సువర్ణాలు ( బంగారం) అయి ఉండాలి. కానీ చాలా మందికి ఈ స్థోమత ఉండదు కాబట్టి….ఈ బంగారు ఆభరణాలకు మినహాయింపు ఇచ్చేటందుకు..కొబ్బరిబోండం, గంధపు చెక్క, గుమ్మడికాయ లాంటి వస్తువులు కన్యాధానం సమయంలో ఇస్తారు. వీటికి పురాణాల్లో బంగారం కంటే ఎక్కువ విలువ ఉంది.

మరో విషయం..చాలా మంది పెళ్లిలో కొబ్బరిబోండం పై సురేష్ వెడ్స్ రాణి, పెళ్లిసందడి, పెళ్లి వేడుక..అని రకరకాల పేర్లు రాస్తారు.ఇలా రాయడం సాంప్రదాయం ప్రకారం తప్పు..ఎందుకంటే కొబ్బరిబోండం పార్వతీపరమేశ్వర స్వరూపం అంటారు. అలాంటి పవిత్ర వస్తువు పై పిచ్చిరాతలు లేకుంటేనే ఉత్తమం.

Admin

Recent Posts