ఆధ్యాత్మికం

పూజ సమయంలో కొబ్బరికాయ కుళ్ళిపోతే అరిష్టమేనా..?

సాధారణంగా భారతీయ సంప్రదాయాల ప్రకారం ఎక్కువగా దైవభక్తిని నమ్ముతారు. దైవానికి ఇచ్చినంత వ్యాల్యూ మరొకదానికి ఇవ్వరు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మనం ఏదైనా దేవాలయం వెళ్ళినప్పుడు ముఖ్యంగా తీసుకెళ్ళేది కొబ్బరికాయ. సాధారణంగా కొబ్బరికాయలు మనం ఎప్పుడైనా గుళ్లో కొట్టినప్పుడు కొన్ని కుళ్ళి పోతు ఉంటాయి. ఇలా జరగడం కొంతమంది అరిష్టంగా భావిస్తూ ఉంటారు. ఇలా కొట్టినప్పుడు అందులో నీళ్లు లేకపోవడం పూర్తిగా కూల్లిపోవడం చూసి చాలామంది ఏదో జరిగిపోతుంది అని కంగారు పడుతూ ఉంటారు.

దైవం కోసం చేసిన పూజలో ఇలా జరిగింది ఏంటి అని బాధపడుతూ ఉంటారు. ఇలా జరగడం అశుభం గా భావిస్తారు. సాధారణంగా కొబ్బరికాయ కుళ్ళిపోవడం సహజమే. దాన్ని అశుభ సూచకంగా భావించవలసి అవసరం ఏమీ లేదు. దేవాలయాల్లో కొట్టిన కొబ్బరికాయ కుళ్ళిపోతే కాయ కుళ్ళి పోలేదని మన పై ఉన్న కుళ్ళు పోయిందని అంటారు. అంటే మనకు జరగబోయే కీడు తొలగిపోతుందని అంటారు.

what happens if coconut spoils when broken during pooja

కొబ్బరికాయ కుళ్ళిపోతే కీడు జరిగింది అనుకోవడం ఒక మానసిక బలహీనత గా భావించాలి తప్ప మరో విధంగా అర్థం చేసుకోకూడదని అంటారు. కొబ్బరికాయ కుళ్ళిపోతే కీడు అని శాస్త్రాల్లో కొన్ని పురాణాల్లో కాని దీనికి ఆధారాలు లేవు . మనం చేసే పూజలు నిష్ట ఉంటే ఇలాంటి సందేహాలు ఉత్పన్నం కావని ఆధ్యాత్మికవేత్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కొట్టిన కొబ్బరికాయ కుళ్ళి పోయిన నీళ్లు లేక పోయినా ఎలాంటి కీడు జరగదని వారంటున్నారు.

Admin

Recent Posts