Off Beat

అంబులెన్స్ కు “108” నంబర్ ఎందుకు వచ్చింది.. దీని వెనుక ఉన్న రహస్యం ఏమిటి..?

అంబులెన్స్ మనకు ఏదైనా ప్రమాద ఘటన జరిగినప్పుడు ముందుగా గుర్తుకు వచ్చేది. ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు గాని, ఎవరైనా పాయిజన్ తీసుకున్నప్పుడు కానీ చాలామంది 108కి కాల్ చేస్తారు. వెంటనే కుయ్ కుయ్ సైరన్ చేసుకుంటూ ప్రమాద ఘటన స్థానంలోకి వస్తుంది. ప్రమాద బాధితులను వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తీసుకువెళుతుంది.

ఇదంతా 108 ద్వారానే జరిగిపోతూ ఉంటుంది. మరి అలాంటి 108 అంబులెన్స్ కు ఆ పేరు ఎలా పెట్టారు.. ఎందుకు పెట్టారు.. ఆ నెంబర్ వెనుక ఉన్నటువంటి అసలు విషయం ఏమిటి.. తెలుసుకుందాం..? భారత దేశం భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశం. కానీ ఇక్కడ చాలామంది హిందువులే ఉన్నారు. వీరు ఎక్కువగా దైవారాధన చేస్తూ ఉంటారు. భారతీయులకు ముఖ్యమైన సంఖ్య 108. దీన్ని పవిత్రమైనదిగా భావిస్తారు.

why ambulance got 108 number

ధ్యానం చేసేటప్పుడు, ఏదైనా జపం చేసేటప్పుడు, గుడి చుట్టూ తిరిగేటప్పుడు 108 వచ్చేట్టు చూసుకుంటారు. భూమి చంద్రుడు సూర్యుడి వ్యాసం సరిగ్గా 108 సార్లు వస్తుంటుంది. శాస్త్రాల ప్రకారం చూసుకుంటే దేశంలో 108 పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. సాధారణంగా మనిషి చనిపోయాక ఆత్మ 108 ఘట్టాలను దాటి వెళ్తుందని ముస్లింల నమ్మకం. దీన్నిబట్టే అంబులెన్స్ కూడా 108 సంఖ్య పెట్టి ఉండవచ్చని భావిస్తున్నారు.

Admin

Recent Posts