ఆధ్యాత్మికం

గ‌రుడ పురాణం పుస్త‌కాన్ని ఇంట్లో పెట్టుకోరాదా ? అశుభం క‌లుగుతుందా ?

హిందూ పురాణాల్లో గ‌రుడ పురాణం ఒక‌టి. అదేదో సినిమాలో చెప్పిన‌ట్లు.. అప్ప‌టి వ‌ర‌కు గ‌రుడ పురాణం గురించి చాలా మందికి తెలియ‌దు. కానీ దాన్ని చ‌ద‌వాల‌ని ప్ర‌తి ఒక్క‌రికీ ఆస‌క్తి ఉంటుంది. అయితే మ‌నిషి చ‌నిపోయాక అత‌నికి న‌ర‌కంలో విధించే శిక్ష‌ల వివ‌రాలు గ‌రుడ పురాణంలో ఉంటాయి. అంద‌వ‌ల్ల ఆ పుస్తకాన్ని ఇంట్లో పెట్టుకోకూడ‌ద‌ని, అశుభం క‌లుగుతుంద‌ని కొంద‌రు చెబుతారు. మ‌రి ఇందులో నిజ‌మెంత ? అంటే..

అన్ని పురాణాల్లాగే గ‌రుడ పురాణం ఒక‌టి. న‌ర‌కంలో మ‌నుషుల‌కు విధించే శిక్ష‌ల వివ‌రాలు ఉంటాయి, క‌నుక దాన్ని ఇంట్లో పెట్టుకోరాద‌ని కొంద‌రు భావిస్తారు. కానీ అది నిజం కాదు. ఎందుకంటే అది ఒక పుస్త‌కం. దుష్ట‌శ‌క్తుల‌కు నిల‌యం కాదు. మ‌న‌కు ఎంతో విలువైన స‌మాచారాన్ని అందిస్తుంది. మ‌నం పాపాలు ఎందుకు చేయ‌కూడ‌దో చెబుతుంది. దాంతో మ‌నం జాగ‌రూకుల‌మై ఉంటాము. కానీ ఆ పుస్త‌కాన్ని ఇంట్లో పెట్టుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి చెడు జ‌ర‌గ‌దు. అది మ‌న విజ్ఞానానికి దోహ‌ద ప‌డుతుంది.

what happens if you put garuda puranam book in home

అయితే గరుడ పురాణంలో ప్రేత ఖండం అని ఒక భాగం ఉంటుంది. అందులో ప్రేత శబ్దం ఎక్కువగా వ‌స్తుంది. శ‌వాల‌ను ఉద్దేశించి ఆ శ‌బ్దాన్ని వాడుతారు. ఇంట్లో శ‌వం గురించి మాట్లాడ‌కూడ‌దు, అమంగ‌ళంగా, అశుభంగా ఉంటుంది, క‌నుక ఆ ఒక్క ప్రేత ఖండాన్ని మాత్రం ఆలయంలో చ‌ద‌వాల‌ని చెబుతారు. ఇక అందులో ఉన్న మిగతా వివ‌రాల‌ను ఇంట్లో కూడా చ‌దువుకోవ‌చ్చు. అంతేకానీ గ‌రుడ పురాణం పుస్త‌కాన్ని ఇంట్లో పెట్టుకోవ‌ద్దు అని భావించడంలో అర్థం లేదు. ఒక పుస్త‌కం మ‌న‌కు చెడు క‌లిగించ‌దు.. అన్న విష‌యాన్ని గుర్తుంచుకోవాలి.

Admin

Recent Posts