ఆధ్యాత్మికం

క‌ల‌శాన్ని ఎందుకు పూజించాలో తెలుసా..?

వైదిక సంప్రదాయంలో ఆయా పూజాదికాలను నిర్వహించేటప్పుడు ముందుగా కలశాన్ని ఆరాధిస్తాం. ప్రతి పూజా కార్యక్రమంలో, శుభ కార్యాల్లోనూ కలశానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. సంకల్పం తర్వాత కలశంలో ఆయా దేవతలను ఆహ్వానిస్తారు.

కలశం అంటే నీటితో నింపిన ఘటం (చెంబు/కుండ). సాధారణంగా కలశాన్ని వెండి, రాగి, ఇత్తడి, మట్టితో చేసిన పాత్రలను ఉపయోగిస్తుంటారు. అయితే ఎక్కువగా పాత్రలను కలశంగా వినియోగిస్తారు. కలశంలో ఏ దేవుడు ఎక్కడ ఉంటాడో తెలుసుకుందాం.. కలశం ముఖభాగంలో విష్ణుమూర్తి, కంఠంలో నీలకంఠుడు అంటే పరమ శివుడు, మూలంలో బ్రహ్మదేవుడు, మధ్యభాగంలో మాత్రుకలు, కలశం గర్భంలో అంటే కలశంలోని జలంలో సమస్త సముద్రాలు, ఏడు ద్వీపాలతో కూడిన భూమి, నాలుగు వేదాలు, సకల దేవతలు కొలువై ఉంటారు.

why do we need to do pooja to kalasham

కలశారాధన వల్ల మన పాపాలన్ని హరించబడుతాయి. పవిత్రలం అవుతాం. కలశారాధన సమయంలో పుణ్యనదీ జలాలను వినియోగిస్తాం. ఇక తెలిసింది కదా.. కలశంలో ఆయా దేవతా ఆహ్వానంతో ఆ ప్రదేశం అంతా పవిత్రం అవుతుంది.

Admin