inspiration

న‌లంద విశ్వ‌విద్యాల‌యంలో విద్య‌ను అభ్య‌సించిన చైనా యాత్రికుడు.. త‌రువాత ఏం జ‌రిగిందంటే..?

చైనా యాత్రికుడు హుయాన్ త్సాంగ్ నలంద విశ్వవిద్యాలయంలో చదువు పూర్తి చేసుకుని, అక్కడే కొన్ని రోజులు అధ్యాపకుడిగా కూడా పని చేశాడు. తరువాత ఆయన స్వదేశానికి వెళ్ళిపోవాలని నిశ్చయించుకున్నాడు. విద్యార్థులకు హుయాన్సైంగ్ చైనా వెళ్ళిపోతున్నాడని తెలిసింది. పదిహేనుమంది విద్యార్థులు ఆయనతో పాటు వెళ్ళిపోవాలనీ, అలా అయితే ఆయనతో సత్సంగం చిరకాలం కొనసాగుతుందనీ భావించారు.

హుయాన్సైంగ్ నలంద విశ్వవిద్యాలయంలో పని చేసేటప్పుడు కొన్ని పుస్తకాలు రాశాడు, కొన్ని కొన్నాడు. వాటిని కూడా తనతో తీసుకు వెళ్ళడానికి నిర్ణయించుకున్నాడు. ఒక నావలో అందరూ ప్రయాణం మొదలుపెట్టారు. దురదృష్టవశాత్తూ దారిలో తుపాను వచ్చి నావ అటూ ఇటూ ఊగిపోసాగింది. నావ నడిపేవాడు హుయాన్సాంగ్తో మహాశయా! ఈ నావలో బరువెక్కువైపోయింది. ముందుకు సాగడం చాలా కష్టం. పుస్తకాల పెట్టెల్ని నీటిలోకి విసిరివేయండి అని అన్నాడు.

hyuanstang educated in nalanda university know what happened next

దాంతో, హుయాన్సాంగ్కి ఏం చేయాలో తోచలేదు. అప్పుడాయన విద్యార్థులలో ఒకడు గురుదేవా! ఈ పుస్తకాలని పారేయాలనే ఆలోచనే వద్దు. ఎందుకంటే పుస్తకాలు విజ్ఞాన భాండాగారం. ఇవి మన దేశస్థులకు ఎంతగానో ఉపయోగపడతాయి. మేము స్వదేశానికి తిరిగి వెళ్ళకపోయినప్పటికీ ఎవరికీ ఎటువంటి నష్టమూ వాటిల్లదు అంటూ తన తోటి విద్యార్థుల వంక చూశాడు. అప్పుడా విద్యార్థులందరూ ఏ మాత్రం సంకోచించకుండా ఆనందంగా సముద్రంలోకి దూకేశారు.

Admin

Recent Posts