ఆధ్యాత్మికం

రావిచెట్టుకు వేపచెట్టుకు పెళ్లి ఎందుకు చేస్తారో తెలుసా?

మన హిందూ పురాణాల ప్రకారం రావిచెట్టును ఎంతో పరమపవిత్రమైన వృక్షంగా భావిస్తాము. స్కంద పురాణం ప్రకారం రావి చెట్టు వేరులో బ్రహ్మ, కాండంలో విష్ణువు, కొమ్మలలో పరమశివుడు కొలువై ఉంటారని చెబుతారు. అదేవిధంగా రావి చెట్టు కాయలలో సకల దేవతలు కొలువై ఉండటంవల్ల రావిచెట్టును మన హిందువులు పరమ పవిత్రమయిన వృక్షమని సాక్షాత్తు శ్రీ కృష్ణ భగవానుడు శ్రీమద్భాగవతంలో తెలియజేశాడు.

ఎంతో పవిత్రమైన ఈ వృక్షానికి శనివారం నువ్వుల నూనెతో పూజ చేయడం వల్ల సకల సంపదలు కలుగుతాయని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు. అదేవిధంగా రావి చెట్టు ఆకులపై దీపారాధన చేయడం వల్ల ఏలినాటి శని గ్రహాలు తొలగిపోతాయి. రావిచెట్టును సాక్షాత్తు ఆ నారాయణుడిగా భావిస్తాము. అదేవిధంగా హిందువులు వేప చెట్టును కూడా ఎంతో పవిత్రమైన చెట్టుగా భావిస్తారు.ఈ క్రమంలోనే వేప చెట్టును లక్ష్మీదేవిగా భావించి ఒకే పాదులో రావి చెట్టు వేప చెట్టు ను నాటి పెద్ద చేస్తారు.

why people marry peepal and neem trees

ఈ విధంగా రావిచెట్టుకు వేపచెట్టుకు ప్రత్యేకమైన పూజలు చేస్తూ వాటికి పెళ్లి చేస్తుంటారు. ఇలా రావిచెట్టుకు వేప చెట్టుకు పెళ్లి చేయడం వల్ల సాక్షాత్తు లక్ష్మీ నారాయణుడికి వివాహం జరిపించినట్లని భక్తులు భావిస్తారు. పవిత్రమైన ఈ వృక్షాలకు వివాహం జరపడం వల్ల పెళ్లి కాని వారికి పెళ్లి జరుగుతుందని, పెళ్లయిన వారికి వారి వైవాహిక జీవితంలో ఎలాంటి ఆటంకాలు లేకుండా సుఖంగా సాగిపోతుందని చెబుతారు. అలాగే సంతానం లేనివారు ఎర్రని వస్త్రంలో ముడుపుకట్టి రావిచెట్టుకు కట్టడం వల్ల సంతానం కలుగుతుందని పండితులు చెబుతున్నారు.

Admin