ఆధ్యాత్మికం

న‌దుల్లోకి నాణేలను ఎందుకు విసురుతారో తెలుసా..?

పురాత‌న కాలం నుంచి మ‌న పూర్వీకులు పాటిస్తూ వ‌స్తున్న ఆచారాలు, సాంప్ర‌దాయాలు అనేక ఉన్నాయి. వాటిలో ఒక‌టే… న‌ది లేదా చెరువులోకి నాణేల‌ను విస‌ర‌డం. నుదుట‌న నాణేన్ని ఉంచి ఇష్ట దైవాన్ని త‌ల‌చుకుని అనంత‌రం ఆ నాణేన్ని న‌ది లేదా చెరువులో గంగ‌మ్మ త‌ల్లి చెంత వేస్తే అప్పుడు కోరుకున్న‌ది జ‌రుగుతుంద‌ని, అదృష్టం క‌ల‌సి వ‌స్తుంద‌ని అంద‌రి విశ్వాసం. దాన్ని ఇప్ప‌టికీ పాటించే వారు అనేక మంది ఉన్నారు. అయితే నిజానికి ఇలా నాణేల‌ను న‌దుల్లోకి విస‌ర‌డం వెనుక సాంప్ర‌దాయం మాత్ర‌మే కాదు, సైన్స్ ప‌రంగా ప‌లు విష‌యాలు కూడా దాగి ఉన్నాయి. అవేమిటంటే…

రాగి అనేది మ‌న శ‌రీరానికి ఎంత‌గానో అవ‌స‌ర‌మైన ఒక కీల‌క‌మైన పోష‌క ప‌దార్థం. దీంతో శ‌రీర మెట‌బాలిజం ప్ర‌క్రియ స‌క్ర‌మంగా జ‌రుగుతుంది. శ‌రీరానికి బ‌లం కూడా చేకూరుతుంది. ఎన్నో జీవ‌క్రియ‌లు స‌రిగ్గా జ‌రుగుతాయి క‌నుక ఆరోగ్యం కూడా బాగుంటుంది. అయితే వెనుక‌టి రోజుల్లో ఇప్ప‌టిలా స్టీల్ కాయిన్స్ లేవు, రాగి నాణేలు ఎక్కువగా చెలామ‌ణీలో ఉండేవి. దీంతోపాటు మ‌న‌కు ఇప్పుడున్న‌ట్టుగా అప్పుడు వాట‌ర్ ఫిల్ట‌ర్లు లేవు. జ‌నాలు నీటిని ఎక్కువగా న‌దులు, చెరువుల నుంచి తెచ్చుకుని తాగేవారు. అయితే అవి తాగ‌డానికి అనువుగా ఉండ‌వు కాబ‌ట్టి, అందులో రాగి నాణేలు వేసేవారు. దీంతో ఆ నాణేల వ‌ల్ల నీరు శుద్ధి అయ్యేది. లోపలంతా అడుగు భాగానికి దుమ్ము చేరి పై భాగానికి శుద్ధమైన నీరు వ‌చ్చేది. ఈ క్ర‌మంలోనే అలా శుద్ధి అయిన నీటిలో రాగి లోహానికి చెందిన అణువులు కూడా ఉంటాయి. అవి మ‌న శ‌రీరానికి ఎంత గానో అవ‌స‌రం. క‌నుక అలా రాగి నాణేలను నదులు, చెరువుల్లోకి విసిరేవారు. దాంతో పైన చెప్పిన‌ట్టుగా రెండు విధాలుగా లాభం జ‌రిగేది.

why people throw coins in river

పూర్వ‌పు రోజుల్లో మ‌న పెద్ద‌లు రాగి పాత్ర‌లో రాత్రి పూట ఉంచిన నీటిని ఉద‌యాన్నే తాగేవారు క‌దా. దాంతో ఆరోగ్యం బాగుంటుంద‌ని వారి న‌మ్మ‌కం. అదే న‌మ్మ‌కంతో చెరువులు, న‌దుల్లో రాగి నాణేల‌ను వేయ‌డం మొద‌లు పెట్టారు. ఆ నాణేల‌ను వేయ‌డం వెనుక ఉన్న అస‌లు ర‌హ‌స్యం అది. అయితే నిజానికి మ‌నం ఇప్పుడు వాట‌ర్ ఫిల్ట‌ర్ల ను వాడుతున్నాం కానీ వాటిలో రాగి వంటి లోహాలు ఉంటున్నాయో లేదో తెలియ‌డం లేదు. ఈ క్ర‌మంలో రోజూ అలా రాగి పాత్ర‌లో ఉంచిన నీటిని తాగితే దాంతో అనేక ర‌కాల ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. అన్న‌ట్టు, మీకు ఇంకో విష‌యం తెలుసా..? రాగి పాత్ర‌లో ఉంచిన నీరు ఎన్న‌టికీ చెడిపోద‌ట‌. ఎప్ప‌టికీ అలాగే ఉంటుంద‌ట‌. కాబ‌ట్టి ఇప్ప‌టికైనా తెలిసిందా..? రాగి నీటి మ‌హ‌త్తు..!

Admin

Recent Posts