ఆధ్యాత్మికం

శ‌నీశ్వ‌రుడి ప్ర‌భావం నుంచి త‌ప్పించుకోవాలంటే ఇలా చేయండి..!

శనీశ్వరుడు.. మనుషుల ప్రవర్తన బట్టి ఉంటాడు.తప్పు చేసినవారిని ఎంత కఠినంగా శిక్షిస్తాడో…మంచి చేసేవారి పట్ల అత్యంత ఉదారంగా వ్యవహరిస్తాడు..గ్రహాల్లో కెల్లా అత్యంత సహనశీలి కూడా శనీశ్వరుడే. తరచుగా ఇబ్బుందులకు గురిచేస్తాడని శనిదేవుడిని తిట్టుకుంటారు. కానీ గతంలో కానీ ప్రస్తుతం చేసిన చెడు పనులకు ప్రతిగా దాని ఫలితాన్ని అనుభవించేలా చేస్తాడనేది మాత్రమే అతి కొద్ది మందికి మాత్రమే తెలుసు. శనీశ్వరుని ప్రభావం నుంచి పూర్తిగా బయటపడకపోయిన, కొంత ఉపశమనం మాత్రం లభిస్తుంది. అయితే జీవులు వారి ధర్మకర్మల ప్రకారం కొన్నింటిని అనుభవించక తప్పదు..11 శనివారాలను తప్పక కొన్ని పూజలు చేస్తే మంచి ఫలితాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్రంలో ఉంది… ఇక ఆలస్యం ఎందుకు ఆ పూజలు గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం…

దోసేడు నల్లనువ్వులు, మినప్పప్పును తీసుకుని నల్లని వస్త్రంలో కట్టి పేదవాళ్లకు దానం చేయాలి. ఇలా చేస్తే డబ్బుకు సంబంధించిన సమస్యలు దాదాపుగా తొలగిపోతాయి. చేతినిండా నల్ల నువ్వులు తీసుకుని మీ కుటుంబ పెద్దతల చుట్టూ తిప్పి వాటిని ఇంటికి ఉత్తరదిక్కులో విసిరేయ్యండి. ఇలా చేస్తే నగదు సంబంధ సమస్యలు ఓ కొలిక్కి వస్తాయి.

lord shani will be pleased if you do these works

నల్లనువ్వులు పాలలో కలిపి ఓం నమో భగవేతే వాసుదేవాయ మంత్రాన్ని ఉచ్చరించాలి. రావి చెట్టు మొదలు దగ్గర పోస్తే ఇంట్లోని ప్రతికూలత‌ శక్తులు తటస్థంగా మారుతాయి. వీధి కుక్కలకు ఆహారాన్ని తినిపిస్తే…రాహు, కేతు, శని గ్రహాల ప్రతికూల ప్రభావం నుంచి బయటపడవచ్చట. వీటికి ఛాయా గ్రహాలు కాబట్టి వీటికి జంతువులతో కూడా సంబంధం ఉంటుంది..ఇలా చెయ్యడం వల్ల గ్రహ దోషాలు అన్నీ తొలగిపోతాయి..

Admin

Recent Posts