ఆధ్యాత్మికం

హిందూ పురాణాల్లో ఉల్లి, వెల్లుల్లిని ఎందుకు నిషేదించారో తెలుసా.?

ప్రపంచంలో ఎన్నో మతాలు, ఒక్కో మతం ఒకో పద్ధతి. అయితే తిండి విషయంలో మన దేశంలో కొన్ని పదార్థాలను తినడం హిందూ సాంప్రదాయం ప్రకారం నిషిద్దం. బ్రహ్మణులతో పాటు కొన్ని కులాల వారు మాంసం తినరని మనకు తెలుసు…అయితే వాస్తవానికి వెల్లుల్లి, ఉల్లిపాయలను కూడా తీసుకోవడం హిందూ సాంప్రదాయం ప్రకారం కొంద‌రికి నిషిద్దమట. ఇప్పటికీ మనలో ఆచారాలను నిష్టగా పాటించే వారు చాలామంది తమ భోజనంలో మాంసాన్ని వెల్లుల్లి, ఉల్లిపాయలను తీసుకోరు. అయితే వారు ఎందుకు వీటిని తమ ఆహారంలో నిషేధించారో తెలుసుకుందాం.

ఆయుర్వేదం ప్రకారం,మనం తీసుకునే ఆహారం మొత్తం మూడు భాగాలుగా విభజించారు.అవే సాత్విక, రాజసిక, తామసిక. వీటిలో ఒక్కో కేటగిరీలోని పదార్థాలు మనిషిలోని ఓక్కో గుణాన్ని పెంచడమో, తగ్గించడమో చేస్తాయి. ఉల్లిపాయ, వెల్లుల్లి , ఇంకా కొన్ని మొక్కలు రాజసిక క్యాటగిరీకి చెందినవి. వీటిని తీసుకోవడం వలన అభిరుచి, అజ్ఞానం ఎక్కువగా కలుగుతాయట. అంతే కాకుండా ఉల్లి, వెల్లుల్లి కామాన్ని ప్రేరేపిస్తాయట. నిష్టతో ఉండాలనుకునే వారిని ఇవి డైవర్ట్ చేస్తాయట.. అందుకే ఆహారంలో వాటిని నిషేదించారట.

why some people do not take garlic and onion

సూక్ష్మజీవులను చంపడం కూడా కొంద‌రు పాపంగా భావిస్తారట. ఉల్లి, వెల్లుల్లి వేర్లుగా భూ అంతర్భాగం నుండి లభిస్తాయి.వాటిని శుభ్రం చేసే సమయంలో ఆ సూక్ష్మజీవులు హత్యకు గురవుతాయని వాటిని తినడానికే దూరంగా ఉంటారట.! మాంసం, ఉల్లిపాయ, వెల్లుల్లి తీసుకోవడం వలన ప్రవర్తన మార్పులు వస్తాయట. ఏం చేస్తున్నారో తెలియని స్థితిలో ఉంటారట. ఈ విషయాలను ఆయుర్వేదంలో చెప్పారట! పురాణాల ప్రకారం,వేదాంతులు చెప్పిన విషయాలను బట్టి ఉల్లిపాయ, వెల్లుల్లి, పుట్ట గొడుగుల‌ను మలినపదార్థాలుగా భావిస్తారట‌. అవి పెరిగే ప్రదేశం కూడా మలినమైన చోటులో, సుచీ శుభ్రత లేకుండా ఉంటాయని వాటికి దూరంగా ఉంటారట, దేవుడ్ని స్వచ్చత‌తో కొలిచేటప్పుడు ఇలాంటివి స్వీకరించడం తప్పుగా భావిస్తారట. అందుకే కొంద‌రు వీటిని తిన‌రు.

Admin

Recent Posts