ఆధ్యాత్మికం

శివరాత్రి రోజున ఉపవాసం, జాగరణ యొక్క ప్రాధాన్యత ఏమిటో తెలుసా.?

<p style&equals;"text-align&colon; justify&semi;">మహాశివరాత్రి&period;&period;హిందువులు జరుపుకునే పండుగల్లో ఒకటి&period;&period;శివరాత్రి రోజు ఉపవాసం ఉండి&comma;జాగారణ చేయడం ప్రత్యేకత&period;&period;పెద్దసంఖ్యలో పెద్దలు&comma;చిన్నపిల్లలు&comma;మగవారు అందరూ ఉపవాసం ఉంటారు శివరాత్రినాడు ముఖ్యంగా ఏదైనా శివాలయాల్లో జాగారణ చేయడానికి మక్కువ చూపుతారు భక్తులు&period;&period;జాగరణ&comma;ఉపవాసంతో&comma;శివారాధనతో పాటు శివరాత్రి రోజు పాటించాల్సిన మరో నియమం ప్రదక్షిణలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మహాశివరాత్రి రోజున ప్రధానం మూడు పద్ధతుల్లో పరమేశ్వరుడిని అర్చించాలని పండితులు అంటున్నారు&period; వీటిలో మొదటిది శివార్చన&comma; రెండోది ఉపవాసం&comma; మూడోది జాగరణం&period; శివరాత్రి రోజున సూర్యోదయానికి ముందే &lpar;ఐదు గంటలకు&rpar; నిద్రలేచి&comma; స్నానాది కార్యక్రమాలను నెరవేర్చుకుని&comma; పూజామందిరం&comma; గృహాన్ని శుభ్రం చేసి&period;&period; పసుపు కుంకుమలు&comma; రంగవల్లికలు&period; తోరణాలతో అలంకరించుకోవాలి&period; తెలుపు రంగు వస్త్రాలు ధరించి శివలింగాన్ని షోడశోపచారాలతో పూజించాలి&period; శివభక్తులతో పాటు ఇతరులకు అన్నదానం చేయాలి&period; శివాలయానికి వెళ్లి శివదర్శనం చేసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">శివరాత్రిలో రెండు ముఖ్యమైన అంశాలున్నాయి&period; ఒకటి&colon; ఉపవాసం&comma; రెండు&colon; జాగరణ&period; ఇక ఉపవాసం సంగతికొస్తే&period;&period; ఉపవాసమంటే శివరూపాన్ని ధ్యానిస్తూ&comma; శివనామస్మరణం చేస్తూ&period;&period; ఉప-సమీపే- అతడికి &lpar;శివుడికి&rpar; దగ్గరగా ఉండటం&period; అంతేగాని ఆహారం తీసుకోకుండా శరీరాన్ని బాధపెట్టడం కాదని వరాహోపనిషత్తు పేర్కొంటోంది&period; ఇక జాగారం ఎలా చేయాలంటే&period;&period;&quest; శివరాత్రి నాటి సూర్యాస్తమం మొదలు మరునాడు సూర్యోదయం వరకు- నాలుగు జాములు నిద్రపోకుండా మేల్కొని ఉండటమని అర్థం&period; ఈ విధంగా జాగారం చేసినవారికి మళ్లీ తల్లి పాలు తాగే అవసరం లేకుండా&comma; పునర్జన్మ నెత్తడం ఉండదని స్కాంద పురాణం చెబుతోంది&period; జాగారం చేసే సమయంలో భగవన్నామ స్మరణం చేస్తే సమస్త పాపాలు హరిస్తాయని విశ్వాసం&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-75853 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;lord-shiva-1&period;jpg" alt&equals;"why we have to do upavasam on maha shivarathri " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">శివరాత్రి నాడు చేసే జాగారాన్ని వ్యర్థ ప్రసంగాల తోనో&comma; ఎటువంటి ప్రయోజనమూ లేని వాటిని చూస్తూనో కాకుండా శివనామాన్ని స్మరిస్తూ&comma; శివగాథలను చదువుకుంటూ చేసినట్లైతే ఆ కాలాన్ని సద్వినియోగ పరచుకొన్నట్లతే పుణ్యం ప్రాప్తిస్తుందని పురోహితులు అంటున్నారు&period; ఇక గృహంలో శివరాత్రి పూజ ఎలా చేయాలంటే…&quest; లింగాకారము గల ప్రతిమను దివ్య సుందరంగా అలంకరించుకుని&comma; ఆ లింగానికి తెలుపు పువ్వులు&comma; వస్త్రాలతో అలంకరించుకోవాలి&period; పూజకు మారేడు ఆకులు&comma; తెల్లపూలమాల&period;&period; నైవేద్యమునకు పొంగలి&comma; బూరెలు&comma; గారెలు&comma; అరటి&comma; జామకాయలను సిద్ధం చేసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో పూజను ప్రారంభించి మరుసటి రోజు ఆరు గంటల వరకు శివధ్యానముతో పూజించాలి&period; జాగారం చేసే వారు à°¶à°¿à°µ అష్టోత్తరము&comma; à°¶à°¿à°µ పంచాక్షరీ స్తోత్రం&comma; దారిద్ర్యదహన స్తోత్రం&comma; శివసహస్రనామము&comma; శివారాధన&comma; శివపురాణములతో లేదా ఓం నమఃశివాయ అనే పంచాక్షరీతో 108 సార్లు మహేశ్వరుడిని పూజించడం మంచిది&period; అలాగే శ్రీశైలం&comma; శ్రీకాళహస్తి&comma; ద్రాక్షారామం&comma; శివధ్యానములు చేయడం మోక్షఫలం చేకూరుతుందని పండితుల వాక్కు&period; ఇంకా ఆలయాల్లో ఏకాదశరుద్రాభిషేకం&comma; 108 బిందెలతో రుద్రాభిషేకం&comma; à°¶à°¿à°µ కళ్యాణం చేయిస్తే వంశాభివృద్ధి&comma; అష్టైశ్వర్యాలు&comma; విశేష పుణ్యఫలితాలు దక్కుతాయని పురాణాలు చెబుతున్నాయి&period; అందుచేత పరమేశ్వరుడిని మహాశివరాత్రినాడు భక్తి శ్రద్ధలతో పూజించి&comma; ఆ దేవదేవుని అనుగ్రహం పొందండి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts