ఆధ్యాత్మికం

Lord Shani Dev : శ‌నివారం రోజు ఈ పనులు చేయ‌కూడ‌ద‌ట తెలుసా..? చేస్తే ఏమ‌వుతుందంటే..?

Lord Shani Dev : మ‌న సౌర వ్య‌వ‌స్థ‌లో 9 గ్ర‌హాలు ఉంటాయ‌ని అంద‌రికీ తెలిసిందే. వీటినే న‌వ‌గ్ర‌హాలు అని వ్య‌వ‌హ‌రిస్తాం. ఈ క్ర‌మంలో జ్యోతిష్య శాస్త్రం, పురాణాల ప్ర‌కారం ఈ 9 గ్ర‌హాలు మ‌నుషుల జీవితాల‌ను ప్ర‌భావితం చేస్తాయ‌ని చెబుతారు. వాటి గ‌మ‌నాన్ని బ‌ట్టి వ్య‌క్తుల జాతకం మారుతూ ఉంటుంది. ఒక్కో గ్ర‌హం ఒక్కో ర‌క‌మైన ఫ‌లితాల‌ను ఇస్తుంది. అదేవిధంగా వారంలో ఉన్న 7 రోజుల్లో ఒక్కో రోజుకు ఒక్కో గ్రహం అధిప‌తిగా ఉంటుంది (రాహు, కేతువుల‌కు త‌ప్ప‌). ఈ క్ర‌మంలో శ‌నిగ్ర‌హం అధిప‌తిగా ఉన్న రోజు శ‌నివారం. మ‌రి ఆ రోజున ఎవ‌రైనా ఏమేం ప‌నులు చేయ‌కూడ‌దో, చేస్తే ఏం జ‌రుగుతుందో ఇప్పుడు తెలుసుకుందామా.

వంకాయ‌లు, న‌ల్ల మిరియాల‌ను శ‌నివారం రోజున కొన‌కూడ‌దు. అలాగే వాడ‌కూడ‌దు. వాడితే శ‌నిగ్ర‌హంతో స‌మ‌స్య‌లు వ‌చ్చి ప‌డ‌తాయ‌ట‌. ఆరోగ్యం బాగుండ‌ద‌ట‌. సంప‌ద హ‌రించుకుపోతుంద‌ట‌. సాధార‌ణంగా వ్య‌క్తులెవ‌రూ మ‌రొక‌రి చేతికి ఉప్పు ఇవ్వ‌రు. కానీ శ‌నివారం రోజున ఉప్పును ఎవ‌రికైనా దాన‌మివ్వ‌వ‌చ్చ‌ట తెలుసా. దీంతో స‌మ‌స్య‌లు తొలగిపోతాయి. అయితే శనివారం రోజున ఉప్పును మాత్రం కొన‌కూడ‌దు. కొంటే ఆర్థిక స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌ట‌. శ‌నివారం రోజున కొత్త వాహ‌నాల‌ను అస్స‌లు కొన‌కూడ‌దు. అలాగే ఇనుప వ‌స్తువుల‌ను కూడా కొన‌కూడ‌దు. కొంటే ప్ర‌మాదాల బారిన ప‌డ‌తార‌ట. పండితులు కూడా ఇదే చెబుతారు. ఇనుప వ‌స్తువులు కొనేందుకు శ‌నివారం మంచిది కాద‌ని వారు అంటారు.

you should not do these works on satur day

మినప పప్పును శ‌నివారం పూట కొన‌కూడ‌దు. తిన‌రాదు. కానీ దాన్ని ఆ రోజున వండి పేద‌ల‌కు దానమివ్వ‌వ‌చ్చు. లేదంటే కాకుల‌కు అయినా పెట్ట‌వ‌చ్చు. దీంతో శ‌ని సంతృప్తి చెందుతాడు. స‌త్ఫ‌లితాల‌ను ఇస్తాడు. న‌లుపు రంగు మీ ఫేవ‌రెట్ క‌ల‌రా. అయితే ఆ రంగు ఉన్న దుస్తుల‌ను మాత్రం శ‌నివారం రోజున వేసుకోరాదు. అలా చేస్తే శ‌నికి ఆగ్ర‌హం వ‌స్తుంద‌ట‌. అంతా అశుభ‌మే క‌లుగుతుంద‌ట‌. శ‌ని స‌మ‌స్య‌ల‌ను సృష్టిస్తాడ‌ట‌. ఆవాల‌ను శ‌నివారం పూట తిన‌రాదు. అలాగే ఆవ‌నూనెను కూడా. ఈ రెండింటినీ ఆ రోజున కొన‌రాదు కూడా. కానీ ఈ రెండింటితో చేసిన ఆహారాన్ని పేద‌ల‌కు దానమివ్వ‌వ‌చ్చు. లేదంటే ఆవ‌నూనెను శ‌నివారం పూట శ‌ని విగ్ర‌హంపై పోసి అభిషేకం చేయాలి. దీంతో శ‌ని సంతృప్తి చెంది మంచి ఫ‌లితాల‌ను ఇస్తాడ‌ట‌. చెక్క ఫ‌ర్నిచ‌ర్‌ను కూడా శ‌నివారం పూట కొన‌కండి. ఒక వేళ ఆ రోజున వాటికి సంబంధించిన డెలివ‌రీ వ‌చ్చినా తీసుకోకండి. మ‌రుస‌టి రోజు డెలివ‌రీ తీసుకోండి. ఇలా చేస్తే శ‌ని స‌మ‌స్య‌ల‌ను సృష్టించ‌డు. అంతా మంచే చేస్తాడు.

Admin

Recent Posts