వినోదం

Sridevi : శ్రీదేవి కోసం అప్ప‌ట్లో ఒక అభిమాని ఎంత‌ ఖర్చు పెట్టాడో తెలిస్తే షాక‌వుతారు..!

Sridevi : స్టార్ హీరోలతో సమానంగా క్రేజ్ తెచ్చుకున్న నటి శ్రీదేవి. ఆమె ఏ హీరోతో నటించినా ఆమె ఆ హీరోకి సరైన జోడీ అని అనిపించుకుంది. అప్పట్లో ఆమె అందం అంటే యూత్ కే కాకుండా సినిమా హీరోలకు కూడా చాలా క్రేజ్ ఉండేది. ఆమెకు పోటీగా ఎంతమంది హీరోయిన్స్ వచ్చినా ఆమెకు సాటి రాలేదు. ఆమె రెండు తరాల నటులతో నటించిందంటే ఆమె హవా ఎలా ఉండేదో అర్ధం చేసుకోవచ్చు. అటువంటి శ్రీదేవి ఆకస్మిక మరణం అందరినీ కలిచి వేసింది. ఆమె మరణ వార్త విన్న తర్వాత ఆమె గురించి సినీ రంగంలో చిన్నా పెద్ద అనే తేడా లేకుండా అన్ని భాషల వారు వారి భావాలను చాలా బాధతో వ్యక్తం చేశారు.

ప్రముఖ తెలుగు సినీ నిర్మాత, దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ ఆమె గురించి ఒక సంద‌ర్భంలో మాట్లాడుతూ.. 1980వ దశకంలో శ్రీదేవి అంటే యువతలో విపరీతమైన క్రేజ్ ఉండేది. దానికి ఉదాహరణగా తమ్మారెడ్డి భరద్వాజ ఒక సంఘటన గురించి చెప్పారు. నేను చదువు ముగించుకొని సినిమాల్లోకి అడుగు పెట్టిన తొలి రోజుల్లో దుబాయ్ నుంచి ఒక స్నేహితుడు ఫోన్ చేసి శ్రీదేవిని చూడటానికి రెండు లక్షల రూపాయిలను ఇస్తానని చెప్పాడు.

a fan spent rs 2 lakhs just to see sridevi once a fan spent rs 2 lakhs just to see sridevi once

షూటింగ్ లో జస్ట్ చూపిస్తే చాలు. పరిచయం కూడా చేయవలసిన అవసరం లేదని అన్నాడు. ఆ రోజుల్లో రెండు లక్షలు అంటే చాలా పెద్ద మొత్తమే. అలాంటిది శ్రీదేవిని చూడటానికి రెండు లక్షలు ఇస్తానని అంటే శ్రీదేవి క్రేజ్ యువతలో ఎలా ఉండేదో అర్ధం చేసుకోవచ్చు. అలా ఆ అభిమాని అప్ప‌ట్లో శ్రీ‌దేవిని చూసేందుకు పెట్టిన ఖ‌ర్చు వార్త చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఆమెకు అప్ప‌ట్లో ఉన్న క్రేజ్ అలాంటిది మ‌రి.

Admin

Recent Posts