అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న

షుగ‌ర్ వ్యాధి మందుల‌తో క్యాన్స‌ర్‌కు చెక్‌

సాధారణంగా షుగర్ వ్యాధి వచ్చిందంటే, దానికి సంబంధించి కొన్ని ఇతర వ్యాధులు కూడా వస్తూంటాయి. అయితే షుగర్ వ్యాధి నియంత్రణకు వాడే మెట్ ఫార్మిన్ మందుతో మహిళలలో వచ్చే బ్రెస్ట్ కేన్సర్ వ్యాధిని కూడా నయం చేయవచ్చని పరిశోధనలు తెలుపుతున్నాయి. టైప్ 2 డయాబెటీస్ కు వాడే మందులద్వారా అనేక సహజ లేదా కృత్రిమ రసాయనాలవలన పెరిగే బ్రెస్ట్ కేన్సర్ కణాలను అరికట్టవచ్చునని ఒక తాజా పరిశోధన తెలిపింది.

ఈ రీసెర్చి దక్షిణ కొరియా లోని సియోల్ నేషనల్ యూనివర్శిటీకి చెందిన ప్రొఫెసర్ జేమ్స్ ట్రోస్కో, అతని సహచరులు నిర్వహించారు. టైప్ 2 డయాబెటీస్ నివారణకు ఉపయోగించే మెట్ ఫార్మిన్ మందును దీర్ఘకాలంలో వాడితే బ్రెస్ట్ కేన్సర్ కారక కణాలు కూడా మరణిస్తాయని పరిశోధకులు తెలిపారు.

taking diabetic medicine can reduce cancer

టైప్ 2 డయాబెటీస్ వున్నవారికి డయాబెటీస్ సంబంధిత కేన్సర్ లు అంటే బ్రెస్ట్, లివర్, పాన్ క్రియాటిక్ కేన్సర్ లు వచ్చే అవకాశం వుందని ప్రొఫెసర్ ట్రోస్కో తెలిపారు. పరిశోధకులు కల్చర్ డిషెస్ ఉపయోగించి మానవ బ్రెస్ట్ ట్యూమర్లను పెంచారు. వాటికి మెట్ ఫార్మిన్ ట్రీట్ మెంట్ ఇస్తే కేన్సర్ కణాల సంఖ్య ఆటోమేటిక్ గా తగ్గిపోయినట్లు కనుగొన్నారు. ఈ పరిశోధనా ఫలితాలను విశ్వ విద్యాలయ హెల్త్ జర్నల్ లో ప్రచురించారు.

Admin

Recent Posts