Balakrishna : సినిమా ఇండస్ట్రీలో పైకి రావాలన్నా.. స్టార్ హీరో స్థాయికి చేరుకోవాలన్నా.. ఉంటే ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ అయినా ఉండాలి.. లేదా డబ్బు అయినా ఉండాలి. ఇవి ఉన్నా కూడా లక్ లేకపోతే ఎవరూ ఏమీ చేయలేరు. అయితే కేవలం తన కష్టం, నటనతో సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరో స్థాయికి చేరుకున్నారు రజనీకాంత్. ఆయనకు ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేదు. డబ్బు అంతకన్నా లేదు. కేవలం తన శ్రమను, నటనను నమ్ముకున్నారు. అందుకనే ఆయన స్టార్ హీరో అయ్యారు. ఇక రజనీకాంత్ కెరీర్‌లో ఎన్నో హిట్ చిత్రాలు ఉన్నాయి. వాటిల్లో బాషా ఒకటి.
ఒక సాధారణ ఆటోడ్రైవర్‌గా కాలం గడుపుతున్న వ్యక్తి ఒక డాన్ తెలుస్తుంది. దీంతో పరిణామాలు ఏవిధంగా మారుతాయి.. అసలు డాన్ అయిన వ్యక్తి ఆటో డ్రైవర్‌గా ఎందుకు జీవనం సాగిస్తున్నాడు.. అనే కథతో బాషా చిత్రం వచ్చింది. అప్పట్లో ఈ మూవీ సౌత్ సినీ ఇండస్ట్రీని షేక్ చేసింది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు, రికార్డులను కొల్లగొట్టింది. తరువాత దీన్ని తెలుగులో డబ్ చేశారు.
అయితే ఈ మూవీకి సురేష్ కృష్ణ దర్శకత్వం వహించారు. ముందుగా తమిళంలోనే తీసినా తెలుగులో మాత్రం ఆయన ఈ మూవీని రీమేక్ చేయాలని అనుకున్నారట. అందుకనే బాషా నిర్మాతలు హైదరాబాద్ లో మన హీరోల కోసం ఓ స్పెషల్ షో వేశారట. ఇక దర్శకుడు సురేష్ కృష్ణ ఈ మూవీని చిరంజీవి లేదా బాలకృష్ణతో రీమేక్ చేయాలని అనుకున్నారట. బాలకృష్ణ అయితే ఈ క్యారెక్టర్‌కు సరిగ్గా సూటవుతారని అనుకున్నారట. దీంతో ఆయనను అనేక సార్లు సురేష్ కృష్ణ అడిగారట.
అయితే బాలయ్యకు రీమేక్స్ అంటే నచ్చవు. ఒరిజినల్ కథతోనే ఆయన సినిమాలు తీస్తారు. కనుక బాషా రీమేక్‌కు ఆయన ఒప్పుకోలేదు. దీంతో చేసేదిలేక రజనీ సినిమానే తెలుగులోకి యథావిధిగా డబ్బింగ్ చేశారు. అయినప్పటికీ తెలుగులోనూ ఈ మూవీ సూపర్ డూపర్ హిట్ అయింది. అయితే అప్పట్లో బాలకృష్ణ బాషా సినిమాను గనక చేసి ఉంటే ఆ కథ వేరేగా ఉండేది. ఆయన కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ అయి ఉండేదని చెప్పవచ్చు.