వినోదం

కోడి రామ‌కృష్ణ త‌ల బ్యాండ్ వెన‌క ఉన్న అస‌లు క‌హానీ ఏంటంటే..!

టాలీవుడ్ టాప్ ద‌ర్శ‌కుల‌లో కోడి రామ‌కృష్ణ ఒక‌రు .సృష్టికి ప్ర‌తిసృష్టి చేసాడు కోడి రామ‌కృష్ణ‌. అలా చేసిన ఏకైక ద‌ర్శ‌కుడు ఈయ‌నే అయ్యుంటాడు కూడా. ఎందుకంటే చ‌నిపోయిన హీరోతో మ‌ళ్లీ ఓ సినిమా చేసి ఔరా అనిపించాడు ఈ ద‌ర్శ‌కుడు. అస‌లు తెలుగు ఇండ‌స్ట్రీలో విజువ‌ల్ ఎఫెక్ట్స్ ఎలా వాడుకోవాలో ప‌క్కాగా తెలిసిన ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి.. కానీ ఈయ‌న కంటే ముందే తెలుగు ఇండ‌స్ట్రీలో గ్రాఫిక్స్ తో మాయాజాలం చేసిన ద‌ర్శ‌కుడు కోడి రామ‌కృష్ణ‌.అస‌లు గ్రాఫిక్స్ అంటే ప్రేక్ష‌కుల‌కు తెలియ‌ని కాలంలోనే అమ్మోరుతో అద్భుతం చేసాడీ ద‌ర్శ‌కుడు. ఆ సినిమాలో వ‌చ్చిన విజువ‌ల్ ఎఫెక్ట్స్ కు అప్ప‌ట్లో ప్రేక్ష‌కులు నోరెళ్ల‌బెట్ట‌డం త‌ప్ప ఏం చేయ‌లేక‌పోయారు.

ఆ త‌ర్వాత అంజి సినిమాలో విజువ‌ల్ ఎఫెక్ట్స్ కు ఏకంగా నేష‌న‌ల్ అవార్డ్ అందుకున్నారు కోడి. అరుంధ‌తి సంచ‌ల‌నం గురించి ఎవ‌రూ అంత తేలిగ్గా మ‌రిచిపోరు. లేడీ ఓరియెంటెడ్ సినిమాలు క‌నుమ‌రుగవుతున్న ఈ రోజుల్లో అరుంధ‌తితో సంచ‌ల‌నం సృష్టించారు కోడి రామ‌కృష్ణ‌. చాలా ఏళ్లు ఖాళీగానే ఉన్న ఈయ‌న‌.. మూడేళ్ల కింద నాగ‌భ‌ర‌ణం అనే సినిమా చేసాడు. ఊపిరితిత్తుల వ్యాధితో ప్రముఖ సినీ దర్శకుడు కోడి రామకృష్ణ తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఆయనను చూడగానే నవ్వుతో కూడిన ముఖం, నుదిటిపై బ్యాండ్ కనిపిస్తాయి ఆయనకు సెంటిమెంట్లు ఎక్కువ.

do you know anything about kodi ramakrishna head band

గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ వీటికి సంబంధించి వివరణ ఇచ్చారు. దాస‌రి ద‌గ్గ‌ర అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా కొన్నాళ్లు ప‌ని చేసిన కోడి రామ‌కృష్ణ త‌న తొలి చిత్రంగా ఇంట్లో రామ‌య్య వీధిలో కృష్ణ‌య్య చేశారు. ఈ సినిమా భారీ విజ‌యం సాధించింది. దీంతో రెండో చిత్రానికి పెద్ద‌గా గ్యాప్ తీసుకోలేదు. కోవ‌లం బీచ్ ద‌గ్గ‌ర త‌న రెండో సినిమా చిత్ర షూటింగ్ జ‌రుపుతున్నారు కోడి రామ‌కృష్ణ‌. ఆ స‌మ‌యంలో అక్క‌డికి ఎన్టీ రామారావు కాస్ట్యూమర్‌ మోకా రామారావు వ‌చ్చార‌ట‌. మిట్ట మ‌ధ్యాహ్నం మండుటెండ‌లో సినిమా చేస్తున్న కోడిని చూసిన ఆయ‌న మీ నుదురు ఎండ‌కి కాలిపోతుంది అని త‌న‌ జేబులో ఉన్న రుమాలు ఇచ్చార‌ట‌.ఆ రోజంతా ఆ రుమాలుని అలానే ఉంచుకున్న కోడి రామ‌కృష్ణ త‌ర్వాతి రోజున బ్యాండ్‌లా త‌యారు చేసి క‌ట్టుకున్నార‌ట‌. ఇది మీకు బాగా సూట్ అయింది. దీనిని క‌ట్టుకోకుండా ఉండొద్దు అని మోకా రామారావు చెప్పార‌ట‌. ఇక అప్ప‌టి నుండి ఆయ‌న‌కి ఈ త‌ల బ్యాండ్ సెంటిమెంట్‌గాను మారింది.

Admin

Recent Posts