వినోదం

ఈ ఫొటోలో ఉన్న హీరో.. హీరోయిన్‌ను గుర్తు ప‌ట్టారా..?

సెల‌బ్రిటీల చిన్న‌ప్ప‌టి పిక్స్ ఇటీవ‌ల సోష‌ల్ మీడియాలో తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తున్న విష‌యం తెలిసిందే. మెగా ఫ్యామిలీకి సంబంధించిన పిక్స్ ఏవి బ‌య‌ట‌కు వ‌చ్చిన అది కొద్ది క్ష‌ణాల‌లోనే వైర‌ల్ అవుతుంది. తాజాగా మెగా ఫ్యామిలీకి చెందిన బామ మ‌ర‌ద‌లు చిన్న‌ప్ప‌టి పిక్ ఒక‌టి నెట్టింట హ‌ల్ చ‌ల్ చేస్తుంది. ఈ పిక్ చూసి అందులో ఉన్న వారెవ‌రు అనేది వెంట‌నే గుర్తు ప‌ట్టేస్తున్నారు నెటిజ‌న్స్. మ‌రి కొంద‌రు మాత్రం కొంత ఆలోచ‌న చేస్తున్నారు. అయితే ఈ పిక్ లో ఉన్న‌వారిలో ఒకరు హీరో అయితే ఇంకొకరు హీరోయిన్ గా సినిమాలు చేసి ఇప్పుడు ప్రొడ్యూసర్ గా మారింది.

ఈ ఫొటోల ఉంది పంజా వైష్ణవ్ తేజ్, నిహారికలే . రెడ్ షర్ట్ లో వైష్ణవ్ ని గుర్తించడం కాస్త‌ ఈజీనేమో, కానీ.. నిహారికను చూస్తుంటే గుర్తుపట్టడం కష్టమే అనిపిస్తోంది. . రీసెంట్ గా నిహారిక బర్త్ డే సందర్భంగా వైష్ణవ్ తేజ్.. ఈ ఫోటోని ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేయ‌గా, ఇది నెట్టింట తెగ హ‌ల్చ‌ల్ చేసింది. చిన్న‌ప్ప‌టి సంగ‌తుల‌ని ఇలా సెలబ్రిటీలు సోష‌ల్ మీడియా వేదిక‌గా షేర్ చేసుకోవ‌డం, అవి నెట్టింట వైర‌ల్ కావ‌డం జ‌రుగుతూ వ‌స్తుంది. నిహారిక చిన్న‌ప్ప‌టి నుండి వైష్ణ‌వ్ తేజ్ తో చాలా స‌ర‌దాగా గ‌డిప‌న‌ట్టు తెలుస్తుంది. వీరిద్ద‌రికి సంబంధించిన ఫొటోలు వీడియోలు చూస్తుంటే అవి ఎంత‌గానో ఆక‌ట్టుకునేలా ఉంటాయి.

have you identified vaishnav tej and niharika in this image

ఓ సంద‌ర్భంలో నిహారిక త‌న బావ‌పై ప్ర‌త్యేక‌మైన అభిమానాన్ని చాటింది. ఓ వీడియో షేర్ చేసిన నిహారిక అందులో తన బావతో సరదాగా ఆడుకుంటూ కనిపించింది నిహారిక. ఇద్దరూ చిన్న పిల్లల్లా ఎంతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ కనిపించారు.. ఈ వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసిన నిహారిక.. వైష్ణవ్ తేజ్‌కి ప్రత్యేకంగా బర్త్ డే విషెస్ చెబుతూ ఈ వీడియో చూసి తమ మధ్య ఎంత బాండింగ్ ఉందనేది అర్థం చేసుకోవచ్చంటూ ట్యాగ్ లైన్ రాసింది. అప్ప‌ట్లో ఈ వీడియోకి ఫుల్ రెస్పాన్స్ వ‌చ్చింది.

Admin

Recent Posts