వినోదం

Chiranjeevi : చిరు మిస్ చేసుకున్న బాలీవుడ్ బ్లాక్ బస్టర్ సినిమా ఏంటో తెలుసా..?

Chiranjeevi : రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారాడు కానీ అప్పట్లో శివ సినిమాతో టాలీవుడ్ గతినే మార్చేశాడు. శివ వచ్చి పాతికేళ్లు అయినా ఇంకా దాని గురించి ఇప్పటికీ మాట్లాడుకుంటుంటారు. అప్పటి వరకు చూడని యాక్షన్, స్క్రీన్ ప్లే, టేకింగ్, మేకింగ్ శివతో పరిచయం అయింది. దీంతో ఆర్జీవీ పేరు ఒక్కసారిగా మార్మోగిపోయింది. దీంతో అటు బాలీవుడ్ కు వెళ్లి రంగీలా, సత్య వంటి సూపర్ హిట్లు తీసి దేశం మొత్తం తన వైపు చూసేలా చేశాడు. ప్రస్తుతం వర్మ సినిమాలు నాసిరకంగా ఉంటున్నాయి. కానీ ఒకప్పుడు వర్మ తీసిన చిత్రాలన్నీ కల్ట్ క్లాసిక్ లుగానే మిగిలాయి.

తెలుగులో శివ సినిమాతో వర్మకు ఎంత గుర్తింపు వచ్చిందో.. హిందీలో ఈ రంగీలా సినిమాతో ఆ రేంజ్ గుర్తింపునే సంపాదించుకున్నాడు వర్మ. అయితే రంగీలా సినిమా తెలుగులోనే తెరకెక్కాల్సిందట. ఇందులో చిరంజీవి, రజినీకాంత్, శ్రీదేవి కలిసి నటించాలి. కానీ వారికీ ఈ సినిమా దక్కలేదు. ఈ విషయాన్ని నిర్మాత అశ్వినీదత్ తెలిపారు.

do you know chiranjeevi missed this movie

ఓ ఇంటర్వ్యూలో అశ్వినీదత్ మాట్లాడుతూ.. శివ సినిమా హిట్ తర్వాత నాతో సినిమా చేయాలని వర్మకు అడ్వాన్స్ ఇచ్చారు. అప్పుడే వర్మ నాకు రంగీలా, గోవిందా గోవిందా సినిమా కథలు చెప్పారు. ఇందులో రంగీలా రజిని, చిరు, శ్రీదేవితో కలిసి తీస్తే సూపర్ హిట్ అవుతుంద‌ని వర్మ అనుకున్నాడు. కానీ నాకు గోవిందా గోవిందా సినిమా కథ నచ్చింది. వెంకటేశ్వరుని చుట్టూ ఆ కథ తిరుగుతుంది. అందుకే నేను ఆ సినిమాను ఓకే చేసి నాగార్జునతో తీశాను.

కానీ రంగీలా సినిమాలో కథ మొత్తం శ్రీదేవి చుట్టూ ఉంటుంది. చిరు, రజిని పాత్రలు అనేవి అంత ఇంపాక్ట్ చూపించవు అని అనుకున్నాను. అందుకే నేను ఆ సినిమా తీయలేద‌ని అశ్వినీదత్ తెలిపారు. కానీ చివరకు రంగీలా సినిమాను వర్మ బాలీవుడ్ లో జాకీ ష్రాఫ్, అమీర్ ఖాన్, ఊర్మిళతో తీశాడు. ఆ సినిమా అనేది బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. మొత్తం బాలీవుడ్ ను షేక్ చేసింది రంగీలా. కానీ ఇక్కడ గోవిందా గోవిందా ఫ్లాప్ అయ్యింది.

Admin

Recent Posts