వినోదం

Balakrishna : బాహుబ‌లి లాంటి చిత్రంలో న‌టించిన ఎన్టీఆర్, బాల‌కృష్ణ‌.. విడుద‌ల‌కి ఎందుకు నోచుకోలేదంటే..!

Balakrishna : బాహుబ‌లి సినిమా తెలుగు సినిమా ఖ్యాతిని ద‌శ‌దిశ‌లా వ్యాపించేలా చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాని భారీ బ‌డ్జెట్‌తో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెరకెక్కించారు. ఈసినిమా ప్రేర‌ణ‌తోనే ఇప్పుడు చాలా సినిమాలు కూడా భారీ బ‌డ్జెట్‌తో షూటింగ్ జ‌రుపుకుంటున్నాయి. అయితే అప్ప‌ట్లోనే బాహుబ‌లి లాంటి సినిమాని ఎన్టీఆర్, బాల‌కృష్ణ చేశార‌ట‌. కాని ప‌లు కార‌ణాల వ‌ల‌న ఆ సినిమా ఆగిపోయింద‌ట‌. సాధార‌ణంగా కొన్ని సినిమాలు మొదలైనప్పటి నుంచే బాల అరిష్టాలు ఎదుర్కొంటూనే ఉంటాయి.మరికొన్ని స‌గం షూటింగ్ అయ్యాక ఇబ్బందుల్లో పడుతాయి.

కొన్ని సినిమాలు అయితే షూటింగ్ పూర్తయ్యాయ కూడా విడుదలకు నోచుకోని పరిస్థితి ఉంటుంది.హీరో బాలయ్య నటించాలనుకున్న నర్తనశాల, కె.విశ్వనాథ్ దర్శకత్వం వహించిన సిరిమువ్వల సింహనాదం, మెగాస్టార్ చిరంజీవి నటించిన సింహపురం సింహం ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొన్న చిత్రాలే .అయితే ఎన్టీఆర్, బాలయ్యతో అనుకొని ఆగిపోయిన సినిమా కంచు కాగడా సినిమాని బాలయ్యతో కలిసి ఓ భారీ జానపద చిత్రంగా చేయాల‌ని అనుకున్నాడు ఉప్పల పాటి విశ్వేశ్వర్ రావు.అందులో భాగంగానే కంచుకోట అనే సినిమాను నిర్మించాడు.ఈ సినిమాకు కథ కూడా ఆయనే రాశాడు.కేఎస్ రావు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో బాల‌య్య‌ కీలక పాత్ర పోషించాడు.

do you know that balakrishna and sr ntr planned baahubali type movie

సావిత్రి, దేవిక హీరోయిన్లు.ఈ సినిమాకు ఆరోజుల్లోనే 7 లక్షల రూపాయలు పెట్టాడు. అయితే ఈ సినిమా అప్పట్లో 30 సెంటర్లలో విడుదల అయ్యింది.కేవలం ఏడు రోజుల్లోనే 7 లక్షల రూపాయలను వసూలు చేసింది . ఆ తర్వాత ఎన్టీఆర్ తో కలిసి కంచు కాగడా సినిమా చేయాలనుకున్నాడు నిర్మాత విశ్వేశ్వర్ రావు.ఇది కూడా జానపద చిత్రంగానే తెరకెక్కించాల‌నుకున్నారు. జమున హీరోయిన్ గా చేసింది.అంతేకాదు ఎన్టీఆర్, బాల‌య్య పై పలు సీన్లు కూడా చిత్రీకరించాడు.అయితే ఆ తర్వాత జమున గర్భవతి అయ్యింది.అయితే ఆమె ప్రసవించాక సినిమా చేయాలి అనుకున్నారు. ఈ సినిమాలో కీలక పాత్ర పోషించిన బాలీవుడ్ హీరో చనిపోవడంతో ఈ సినిమా వాయిదా పడింది. ఇక ఈ సినిమా అలాగే మిగిలిపోయింది.

Admin

Recent Posts