ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో సొంతంగా స్టార్డమ్ సంపాదించుకొని, స్టార్ హీరో గా కొనసాగుతున్న వారిలో ఎన్టీఆర్ మరియు గోపీచంద్ కూడా ఉన్నారు. అయితే వీరు నటించిన సినిమాలు ఆన్లైన్ కథతో థియేటర్లోకి వచ్చి ఏది సక్సెస్ అయిందో ఓసారి చూద్దాం..!
ఒక్కోసారి ఇండస్ట్రీలో కొన్ని సినిమాలు ఒకే లైన్ కథలో వచ్చినా వాటి యొక్క కథనాలు మాత్రం వేరుగా ఉంటాయి. ప్రముఖ రచయిత పరుచూరి చెప్పిన దాని ప్రకారం దేవదాసు మరియు అర్జున్ రెడ్డి సినిమా కథలు ఒకే విధంగా ఉన్నా కథనాల్లో మాత్రం తేడాలు ఉన్నాయి.
అయితే ఈ రెండు సినిమాలు బ్లాక్ బాస్టర్ హిట్ అయినవే. ఒక్కోసారి కొన్ని సినిమాల కథలు ఒకే విధంగా ఉన్నా వాటిలో ఉండే కథనాలు మరియు వారు చేసే యాక్టింగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటే ఆ సినిమా సక్సెస్ అవుతుంది. ఒక్కోసారి సినిమా హీరో హీరోయిన్ ను బట్టి కథాకథనాలు బట్టి ఫలితాలు కూడా వస్తాయి. అయితే హీరో ఎన్టీఆర్ మరియు గోపీచంద్ ఒకే రకమైన కథతో మూవీ చేశారు. కానీ సినిమా ఫలితాలు మాత్రం పెద్దగా తేడా ఏమీ లేదనీ చెప్పవచ్చు. బి.వి.ఎస్.రవి డైరెక్షన్ లో 2011లో వాంటెడ్ మూవీ గోపీచంద్ చేశారు. ఈ సినిమా కథ హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ మొదలవుతుంది. కానీ హీరోయిన్ లవ్ చేయాలంటే విలన్ కుటుంబాన్ని చంపాలని ఒక కండిషన్ పెడుతోంది.
విలన్ చేతిలో హీరోయిన్ కుటుంబం చనిపోవడం అనేది ఆ కథ ఫ్లాష్ బ్యాక్ లో మనకు చూపిస్తారు. అలాగే ఇలాంటి స్టోరీ ఊసరవెల్లి సినిమాలో ఎన్టీఆర్ తో హీరోగా తెరకెక్కించారు. ఈ రెండు సినిమాలు ఒకే రకమైన కథాకథనం తో వచ్చి ఫ్లాపయ్యాయి. ఇందులో ఊసరవెల్లి చిత్రం కాస్త బెటర్ అనిపించుకుంది. ఈ రెండు సినిమాల్లోనూ ప్రకాష్ రాజ్ విలన్ గా నటించారు. ఈ రెండు సినిమా కథలలో హీరోయిన్ ఫ్యామిలీ లో ఒకరు పోలీస్ గా ఉంటారు.