వినోదం

లవర్ బాయ్ పేరు తెచ్చుకొని కనబడకుండా పోయినా టాప్ హీరోస్..

తెలుగు ఇండస్ట్రీలో కొంత మంది హీరోలు కొన్ని సంవత్సరాల పాటు స్టార్ హీరోగా కొనసాగి ఒక్కసారిగా కనుమరుగైపోయారు. అప్పటికే ఎన్నో సినిమాలు తీసి లవర్ బాయ్ గా పేరు తెచ్చుకొని ఎంత స్పీడ్ గా ఎదిగారో, అంతే స్పీడ్ గా ఇండస్ట్రీకి దూరమైపోయి కనీసం ఎక్కడ కూడా కనిపించ లేని పరిస్థితిలో ఉన్నారు.. అలాంటి హీరోలు ఎవరో ఓ సారి చూద్దాం.

1. హీరో తరుణ్

చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన తరుణ్ ఎంతో పేరు తెచ్చుకొని, ‘నువ్వే కావాలి’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో ఎంతో మంది అమ్మాయిల మనసులు కొల్లగొట్టి లవర్ బాయ్ గా మారిపోయారు.. దీని తర్వాత కథ ఎంపికలో కాస్త ఇబ్బంది పడ్డ తరుణ్ వరుస ఫ్లాప్ లతో ఇండస్ట్రీకి దూరమయ్యారు.

do you know that these actors got lover boy image

2. వినీత్ -అబ్బాస్ :

90వ దశకంలో వినీత్ ఎన్నో సినిమాలు చేసి లవర్ బాయ్ గా పేరు పొందారు. ప్రేమదేశం మూవీతో యావత్ సౌత్ ఇండియాలోనే అమ్మాయిల కలల రాకుమారుడిగా మారిన కానీ సరైన పేరు వినీత్ కి రాలేదు. అలాగే ఇదే మూవీతో తెలుగు ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించుకున్న అబ్బాస్, నటనతోనే కాకుండా స్టైల్ తో కూడా ఒక సూపర్ లవర్బాయ్ ఇమేజ్ ను సంపాదించుకున్నారు.

3.సిద్ధార్థ్ :

బొమ్మరిల్లు లాంటి ప్రేమ కథా చిత్రాలతో అలరించి ఒక వెలుగు వెలిగిన హీరో సిద్ధార్థ్.. లవర్ బాయ్ గా మంచి పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఆయన హర్రర్ లాంటి చిత్రాల్లో నటిస్తున్నారు. ఆయన కూడా చాలా రోజుల నుంచి తెలుగు సినిమాలు చేయడం మానేశారు.

Admin

Recent Posts