హెల్త్ టిప్స్

Dry Ginger With Milk : రాత్రి నిద్రించే ముందు దీన్ని పాల‌లో క‌లిపి తాగండి.. ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Dry Ginger With Milk : ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉండాలంటే మనం తీసుకునే ఆహారం విషయంలో చాలా శ్రద్ద పెట్టాలి. రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు గోరువెచ్చని పాలలో చిటికెడు శొంఠి పొడి కలిపి తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. శొంఠి పొడి ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది. శొంఠి పొడిలో యాంటీ ఇన్ ఫ్లామేటరీ లక్షణాలు సమృద్ధిగా ఉండడం వల్ల దగ్గు, జలుబు, గొంతు నొప్పి వంటి వాటి నుండి ఉపశమనం కలుగుతుంది, అంతేకాకుండా గ్యాస్, కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలు తొలగిపోతాయి. జీర్ణ సంబంధ‌ సమస్యలు ఉన్నవారికి చాలా బాగా సహాయపడుతుంది.

ఈ పొడి శరీరంలోని విషాలను బయటకు పంపుతుంది. బరువు తగ్గడానికి, శరీరంలోని కొవ్వును కరిగించడానికి సహాయపడుతుంది. ఎక్కిళ్ళు వస్తే ఒక పట్టాన తగ్గవు. అలాంటప్పుడు ఈ శొంఠి పాలను తాగితే ఎక్కిళ్లు తగ్గుతాయి. శొంఠి పొడిలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ ఫ్లామేటరీ లక్షణాలు ఉండడం వల్ల శరీరంలో వ్యాధి నిరోధక వ్యవస్థను బలోపేతం చేసి ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది.

Dry Ginger With Milk many wonderful health benefits

కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పుల సమస్య ఉన్నవారు ప్రతి రోజూ ఇలా తాగితే నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది. ఈ పాలను ప్రతి రోజూ కాకుండా వారంలో మూడు సార్లు తాగితే మంచిది. శొంఠి పొడి మార్కెట్లో లభ్యం అవుతుంది. అలా కాకుండా మనం శొంఠి కొమ్ములను తెచ్చుకుని నూనె లేదా నేతిలో వేయించి పొడిగా తయారు చేసుకుంటే చాలా మంచిది. మంచి ఫ్లేవర్ తో వ‌స్తుంది. దీన్ని తీసుకుంటే ఇంకా ఎక్కువ మొత్తంలో ఫ‌లితం క‌లుగుతుంది.

Admin

Recent Posts