వినోదం

ఈ ద‌ర్శ‌కుల‌కు త‌మ కెరీర్‌లో ఫ్లాప్ అంటే తెలియ‌దు..!

డైరెక్టర్ అంటే కెప్టెన్ ఆఫ్ ది షిప్ అంటుంటారు. హీరో ఎవరనేది కొంతవరకు హైప్ చేయగలదు కానీ రిలీజ్ అయ్యాక సినిమా కథ బాగుంటేనే, ఎమోషన్స్, ఎలివేషన్స్, కామెడీ ఎలిమెంట్స్ బాగుంటేనే సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద హిట్ అవుతుంది. స్టోరీస్ సెలక్షన్ హీరోని చూజ్ చేసుకోవడం నుంచి మూవీకి సంబంధించి అన్ని టెక్నికల్ ఫిల్డ్స్ లో పట్టు ఉండాలి. అందుకే సినిమాకి డైరెక్టర్ ని మెయిన్ గా చూస్తారు. మరి అలాంటి డైరెక్టర్లు కంటిన్యూస్ గా హిట్లు ఇస్తూ ఆడియన్స్ ను అలరించడం అంటే మామూలు విషయం కాదు.ఎంతో కృషి, పట్టుదల ఉంటేనే అలాంటి విజయాలు సాధించవచ్చు. మన ఇండియన్ సినిమాలో అలాంటి డైరెక్టర్లు కొంతమంది ఉన్నారు. అయితే ఇప్పటివరకు వీరు తీసిన సినిమాలు హిట్స్ తప్ప ఫ్లాప్ అసలు కాలేదు, మరి ఆ డైరెక్టర్స్ ఎవరో చూద్దాం.

ఎస్ ఎస్ రాజమౌళి: ఆర్ ఆర్ ఆర్ సినిమా వరకు మొత్తం 12 సినిమాలు డైరెక్షన్ చేశారు రాజమౌళి. ఇందులో అన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద‌ సూపర్ హిట్ అయ్యాయి. అట్లీ: తక్కువ సినిమాలు చేసిన ఎక్కువ పాపులారిటి సంపాదించుకున్న డైరెక్టర్ ఎవరంటే అట్లీ. ఆయన తీసిన ప్రతి సినిమా సూపర్ హిట్ అయింది. లోకేష్ కనకరాజు: నగరం, ఖైదీ, మాస్టర్ ఇలా వరుస సినిమాలతో హిట్ అందుకున్నారు కనకరాజు. ఈయన తీసిన సినిమాల్లో ఇప్పటికి ఒక్క ప్లాప్ కూడా లేదు. ప్రశాంత్ నీల్: కేజిఎఫ్ సినిమాతో ప్రశాంత్ నీల్ పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోయింది. ఉగ్రం మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. ఆయన కెరీర్ లో ఒక్క ఫ్లాప్ కూడా లేదు.

do you know these directors did not see a flop till now

వెట్రిమారన్: ఆయన ఇప్పటివరకు ఐదు సినిమాలు తీశారు. అన్ని సూపర్ హిట్ సినిమాలే. ఇందులో నాలుగు సినిమాలు ధనుష్ తోనే తీశారు. రాజకుమార్ హిరని: సినిమాలో మెసేజ్ అండ్ ఎమోషన్స్ ని ఎక్కువగా చూపించడంలో దిట్ట. ఈ డైరెక్టర్ ఇప్పటివరకు ఐదు సినిమాలు చేశారు. అన్ని బ్లాక్ బస్టర్ హిట్. అనిల్ రావిపూడి.. అనిల్ రావిపూడి ఇప్పటివరకు ఏడు సినిమాలు చేసాడు. టాలీవుడ్‌లో రాజమౌళి తర్వాత ఈ తరంలో డబుల్ హ్యాట్రిక్ సాధించిన ఏకైక దర్శకుడు అనిల్. సందీప్ రెడ్డి వంగ.. తెలుగులో అర్జున్ రెడ్డి అంటే హిందీలో కబీర్ సింగ్ సినిమాలు చేసాడు. ఇది ఒక కథ. కానీ అదే కథతో తెలుగు, హిందీ భాషల్లో బ్లాక్‌బస్టర్స్‌ అందించాడు. త‌రువాత ర‌ణ‌బీర్‌తో యానిమ‌ల్ తీసి హిట్ కొట్టాడు.

Admin

Recent Posts