ప్రేమించుకునే యువతీ యువకులైనా, కాబోయే వధూ వరులైనా తమ భాగస్వామి పవిత్రంగా ఉండాలనే కోరుకుంటారు. ఎవరితోనూ ఎలాంటి శారీరక సంబంధాలు కలిగి ఉండరాదనే వారు ఆశిస్తారు. అయితే అందరూ ఆశించినట్టుగా కొన్ని జంటలకు మాత్రం జరగదు లెండి. అది వేరే విషయం. అయితే ఏ జంటను తీసుకున్నా అందులో స్త్రీ కన్నె అవునో, కాదో పురుషుడు కచ్చితంగా చెప్పేస్తాడు. కానీ స్త్రీలకు మాత్రం పురుషుడు కన్నె అవునో, కాదో గుర్తించడం కష్టతరమవుతుంది. ఆ క్రమంలోనే కొందరు తమ పార్ట్‌నర్స్‌ను డైరెక్ట్‌గా అడిగేస్తారు. దీంతో వారి సంబంధానికి అసలుకే ఎసరు వస్తుంది. అయితే అలాంటి ఇబ్బంది ఉండకుండా స్త్రీలు తమ పార్ట్‌నర్ నిజంగా కన్నె అవునో, కాదో గుర్తించడానికి పలు టిప్స్ ఉన్నాయి. అవేమిటంటే…
పర స్త్రీ ఎవరైనా మాట్లాడినా, లేదంటే టచ్ చేసినా కొందరు పురుషులు సిగ్గుగా ఫీలవుతారు. వారి సాన్నిహిత్యం నుంచి బయట పడాలని చూస్తారు. ఇలాంటి పురుషులైతే చాలా వరకు వర్జిన్ అయ్యేందుకు అవకాశం ఉంటుందట. అలాగే స్త్రీలంటే ఏమాత్రం బెరుకు లేకుండా, వారితో క్లోజ్‌గా మూవ్ అయ్యే పురుషుల్లో మాత్రం వర్జిన్స్ ఉండరట. వారికి ఎవరితోనో ఒకరికి సంబంధం ఉండే తీరుతుందట. పురుషుడు ఒక వేళ వర్జిన్ అయ్యే ఉంటే ఒంటరిగా ఉన్న స్త్రీ తో ఉండేందుకు చాలా ఇబ్బందిగా ఫీలవుతాడట. చాలా నర్వస్‌గా కూడా ఉంటాడట.
పురుషుడు వర్జినా కాదా అనేది కనిపెట్టాలంటే ఇంకో ట్రిక్ ఉంది. అది కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. అయినా తప్పదు. అదేమిటంటే… స్త్రీ శృంగారానికి ఆహ్వానించడం లేదంటే… అందుకు ప్రేరేపించడం… వంటి పనులు చేస్తే పురుషుడు వర్జినా కాదా అన్నది తెలుస్తుందట. ఎలా అంటే ఒకవేళ పురుషుడు వర్జిన్ అయితే చాలా బిడియం చెందుతాడట. అస్సలు ఆ పనికి ఒప్పుకోడట. అదే వర్జిన్ కాకపోతే ఎలాంటి జంకు బొంకు లేకుండా మీద పడతాడట. పురుషుడు వర్జిన్ అవునో, కాదో తెలుసుకోవాలంటే ఇక చివరిగా ఇంకో ట్రిక్ ఉంది. అదేమిటంటే… గర్ల్ ఫ్రెండ్ కిస్ చేయడం. అలా చేస్తే పురుషుడు ఇబ్బందిగా ఫీలవుతాడు. దూరంగా జరుగుతాడు. అలా చేస్తే అతను వర్జిన్ కిందే లెక్క. లేదంటే కాదు..!