వినోదం

ఆది పినిశెట్టి నటించిన శబ్దం మూవీ ఎలా ఉంది?

దర్శకుడు ఆరివళగన్, ఆది పినిశెట్టి కాంబోలో 2009లో వైశాలి అనే మూవీ వచ్చింది. హారర్ థ్రిల్లర్ జోనర్ లో కల్ట్ క్లాసిక్ గా నిలిచింది ఆ మూవీ. ఆ విధంగా చాలా కాలం తర్వాత ఆ కాంబో రిపీట్ అవుతుంటే ఎలా ఉంటుందా అనే ఆసక్తితో సినిమా చూడటానికి థియేటర్ కి వెళ్ళాను. మరి శబ్దం మూవీ బాగుందా అంటే…? ఫ‌ర్లేదు ఒకసారి చూడొచ్చు. ఫస్టాఫ్ చాలా బాగా తీశాడు దర్శకుడు. కానీ సెకండాఫ్ విషయానికి వచ్చేసరికి తడబడ్డాడు అనిపించింది. ఏదేమైనా సెకండ్ హాఫ్ లో స్క్రీన్ ప్లే విషయంలో ఇంకొంచెం హార్డ్ వర్క్ చేసుంటే బాగుండేది అనిపించింది.

ఈ సినిమాకి ఉన్న ప్రధాన ఆకర్షణ సౌండ్ డిజైనింగ్. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చాడు. అట్లాగే ఘోస్ట్ ఇన్వెస్టిగేటర్ గా ఆది పినిశెట్టి యాక్టింగ్ కూడా చాలా బాగుంటుంది. కథలోకి వెళితే… ఒక కాలేజీలో హఠాత్తుగా కొంత మంది స్టూడెంట్స్ చనిపోతుంటారు. మిగతా స్టూడెంట్స్ అది దెయ్యాల పని అని భయపడుతుంటారు. ఆ తర్వాత కాలేజీ యాజమాన్యం ఆది పినిశెట్టిని రప్పిస్తుంది. ఎంక్వైరీలో భాగంగా హీరోకి కొన్ని విస్తుపోయే నిజాలు తెలుస్తాయి. ఈ వరుస హత్యలకి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 42 ఆత్మలు కారణం అని తెలుస్తుంది.

how is adi pinishetty shabdam movie

ఆ ఆత్మలు ఎవరివి…? అవి ఎందుకలా ప్రవర్తిస్తున్నాయి…? ఫైనల్ గా హీరో సమస్యకి పరిష్కారం కనుక్కున్నాడా లేదా అన్నది మూవీ చూసి తెలుసుకుంటే బాగుంటుంది. నటన పరంగా చూసుకుంటే ఆది పినిశెట్టి, లక్ష్మీ మీనన్ చాలా బాగా నటించారు. గెస్ట్ రోల్ లో హీరోయిన్ లైలా, సిమ్రాన్ లు కనిపిస్తారు. హార్ర‌ర్ మూవీలు అంటే ఇష్ట‌ప‌డే వారికి ఈ మూవీ క‌చ్చితంగా న‌చ్చి తీరుతుంది.

Admin

Recent Posts