యాపిల్ భామ హన్సిక గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. బాలీవుడ్ నుంచి దక్షిణాది సినీ పరిశ్రమలో అడుగు పెట్టిన హన్సిక మోత్వాని మంచి మంచి సినిమాలు చేసి తెలుగు ప్రేక్షకులని అలరించింది. టీవీ సీరియల్స్‌లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించడం ద్వారా తన కెరీర్‌ను ప్రారంభించిన హన్సిక మోత్వాని పెళ్లి కూడా చేసుకుంది. జైపూర్ కోటలో వివాహం చేసుకుంది.
అయితే ఎప్పుడైతే హన్సిక తనకు కాబోయే భర్త ఫొటోలు షేర్ చేసిందో ఇక అప్పటి నుండి సోహెల్ ఏం చేస్తాడు అన్న దాని గురించి సోషల్ మీడియాలో జోరుగా వార్తలు వినిపించడంతో అతనికి సంబంధించిన ఒక ఆసక్తికర వార్త చక్కర్లు కొడుతోంది.
సోహెల్ ఈయన ఓ పెద్ద బిజినెస్ మ్యాన్ అని, కోట్ల ఆస్తికి వారసుడు అట. ఇక పడిపోయే బిజినెస్‌ని కూడా పైకి తేగల టాలెంట్ అతనిలో ఉందని అంటున్నారు. ముంబైలో ప్రముఖ వ్యాపారవేత్తగా ఈయనకి ఎంతో పేరు ప్రతిష్టలు ఉన్నాయి . జైపూర్ లోని పురాతన ప్యాలెస్ లో ఎంతో ఘనంగా వీళ్ళ పెళ్లి జరిగింది. దేశ ముదురు సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ హన్సిక. బన్నీ సరసన హీరోయిన్‌గా నటించి మెప్పించింది.. తన యాక్టింగ్‌తో అందర్నీ కట్టి పడేసింది. 4 ఏళ్లుగా సినిమాకు గ్యాప్ ఇచ్చి..ఇప్పుడు మళ్లీ సినిమాలు చేస్తుంది.