వినోదం

Chiranjeevi : చిరంజీవికే వ‌ణుకు పుట్టించిన వెంక‌టేష్ సినిమా ఏంటో తెలుసా..?

Chiranjeevi : టాలీవుడ్ టాప్ హీరోల‌లో ఒక‌రిగా ఉన్న చిరంజీవి తన కెరీర్‌లో ఎన్నో సూప‌ర్ హిట్ చిత్రాలు చేశారు. వాటిలో గ్యాంగ్ లీడ‌ర్ చిత్రం కూడా ఒక‌టి.ఆ రోజుల్లో ఈ సినిమా సృష్టించిన ప్రభంజనం మామూలుది కాదు.వరుస ఇండస్ట్రీ హిట్స్ తో రికార్డ్స్ తో సావాసం చేస్తున్న మెగాస్టార్ కి మరో ఇండస్ట్రీ హిట్ గా ఈ మూవీ నిలిచింది. చిత్రం వచ్చి 3 దశాబ్దాలు దాటిన అభిమానులు ఇప్పటికే ఈ సినిమాలోని డైలాగులు గుర్తు చేసుకుంటూ ఉంటారు. 1991లో విజ‌య బాపినీడ్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా విజ‌య‌శాంతి హీరోయిన్ గా న‌టించింది. ఈ సినిమా చిరంజీవికి మాస్ ఆడియ‌న్స్ లో క్రేజ్ పెంచింది.

ఈ సినిమా త‌ర‌వాత అంద‌రూ గ్యాంగ్ లీడ‌ర్ మూడ్ లో ఉంటే వెంక‌టేష్ బొబ్బిలి రాజా సినిమాతో వ‌చ్చాడు. బొబ్బిలి రాజా చిత్రానికి స్టార్ డైరెక్ట‌ర్ బి గోపాల్ ఈ సినిమాకు ద‌ర్శక‌త్వం వ‌హించ‌గా సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యానర్ లో ఈ సినిమాని రూపొందించారు. ఆ త‌ర్వాత వెంకటేష్ మరో విభిన్నమైన కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ చిత్రం పేరు చంటి. రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో రూపొందిన‌ ఈ చిత్రంలో వెంకటేష్ కు జోడీగా మీనా నటించింది. ముఖ్యమైన పాత్రలో నాజర్ నటించారు. ఇళయరాజా ఈ సినిమాకు స్వ‌రాలు సమకూర్చగా సినిమాలోని పాటలు ప్ర‌తి ఒక్క‌రిని ఎంత‌గానో అల‌రించాయి.. 1991లో విడుదలైన ఈ సినిమా ఏడు కోట్ల షేర్ వసూలు చేసి చిరంజీవి గ్యాంగ్ లీడర్ సినిమాను సైతం అధిగమించింది.

do you know which venkatesh movie given competition to chiranjeevi

అయితే చంటి సినిమా ఏకంగా తొమ్మిది కోట్ల షేర్ వసూలు చేసి 1992లో సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఇక ఈ సినిమాను బీట్ చేస్తూ ఘరానా మొగుడు సినిమా 10 కోట్ల షేర్ వసూలు చేసి అదే సంవత్సరం మరో ఇండస్ట్రీ హిట్ గా నిలవడం విశేషం. ఘ‌రానా మొగుడు సినిమాతో చిరంజీవి మాస్ ఇమేజ్ మ‌రింత పెరిగింది. మొద‌టి నుండి ఈ ఇద్ద‌రు హీరోల మ‌ధ్య మంచి ఫైట్ ఉండ‌గా, ఇప్ప‌టికీ ప‌లు సంద‌ర్భాల‌లో పోటీ ప‌డుతూనే ఉన్నారు. ఇటీవ‌ల వెంక‌టేష్‌, చిరంజీవి ఎక్కువ‌గా మ‌ల్టీ స్టార‌ర్ చిత్రాలు చేస్తుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.

Admin

Recent Posts