వినోదం

Simhadri Movie : సింహాద్రి మూవీని మిస్ చేసుకున్న స్టార్ హీరోలు ఎవ‌రో తెలుసా..?

Simhadri Movie : దర్శకధీరుడు రాజమౌళి మొదటి సినిమా స్టూడెంట్ నెం.1 అప్పట్లో ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలిసిందే. మొదటి సినిమాతోనే రాజమౌళి సక్సెస్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. ప్ర‌స్తుతం ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి ఇండియాలోనే టాప్ డైరెక్ట‌ర్ గా ఉన్నాడు. ఇప్ప‌టి వ‌ర‌కూ ఫ్లాప్ ఎర‌గ‌ని ద‌ర్శ‌కుడిగా రాజ‌మౌళి గుర్తింపు తెచ్చుకున్నారు. జ‌క్క‌న్న‌కు దేశవ్యాప్తంగా ఉన్న క్రేజ్ తో ఆయ‌న సినిమాలో చిన్న పాత్ర దొరికినా చాలని అనుకునేవాళ్లు చాలామంది ఉన్నారు.

కానీ ఒక‌ప్పుడు జ‌క్క‌న్న నుండి ఆఫర్ వ‌చ్చినా కొంత‌మంది మిస్ చేసుకున్నారు. వాళ్లు ఎవ‌రంటే.. జ‌క్క‌న్న మొద‌ట సింహాద్రి క‌థ‌ను రెబల్ స్టార్ ప్ర‌భాస్ తో చేయాల‌ని అనుకున్నాడట‌. దాంతో ప్ర‌భాస్ కు ఈ సినిమా క‌థ‌ను కూడా వినిపించాడ‌ట‌. కానీ ప్ర‌భాస్ మాత్రం సింహాద్రి సినిమాను సున్నితంగా రిజెక్ట్ చేశాడ‌ట‌. అంతే కాకుండా సింహాద్రి క‌థ నందమూరి నట సింహం బాల‌య్య బాబుకు చాలా బాగా సెట్ అవుతుంద‌ని కూడా రాజ‌మౌళి అనుకున్నార‌ట‌.

do you know who missed to do simhadri movie

ఆయ‌నకు కూడా ఈ సినిమా క‌థ‌ను వినిపించార‌ట‌. కానీ బాల‌య్య మాత్రం ఈ సినిమా చేసేందుకు పెద్ద‌గా ఆస‌క్తి చూపించ‌లేదట‌. ఇక చివ‌ర‌గా జ‌క్క‌న్న ఇదే క‌థ‌ను ఎన్టీఆర్ కు వినిపించారు. ఈ సినిమా క‌థ ఎన్టీఆర్ కు తెగ న‌చ్చేసింది. దీంతో ఈ సినిమాలో హీరోగా ఎన్టీఆర్ ఫిక్స్ అయిపోయారు. ఇక స్టూడెంట్ నంబ‌ర్ వ‌న్ త‌రువాత సింహాద్రితో ఎన్టీఆర్ జ‌క్క‌న్న కాంబోలో మ‌రో సూప‌ర్ హిట్ ప‌డింది.

Admin

Recent Posts