లేడి పవర్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న సాయి పల్లవి ఆచి తూచి సినిమాలు చేస్తుంటుంది. . డ్యాన్సర్‌గా కెరీర్ మొదలుపెట్టిన సాయి పల్లవి మలయాళ ఇండస్ట్రీలో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి, ఆ తర్వాత ప్రేమమ్ సినిమాతో హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. తొలి సినిమాతోనే మంచి హిట్ కొట్టిన ఈ భామ ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. తక్కువ కాలంలోన తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఫిదా నుంచి మొన్న వచ్చిన విరాటపర్వం వరకు అన్ని చిత్రాలలో కూడా విభిన్నమైన పాత్రలు పోషిస్తూ అభిమానులను అలరిస్తుంది. తెలుగు, తమిళ, కేరళ భాషల్లో సినిమాలు చేస్తూ మోస్ట్ టాలెంటెడ్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది.
సాయి పల్లవి ఓ పట్టాన సినిమా ఓకే చేయదు. కథ నచ్చి అందులో తన పాత్రకు ప్రాధాన్యత ఉంటే తప్పిస్తే ఆ సినిమాకు సాయి పల్లవి గ్రీన్ సిగ్నల్ ఇవ్వదనే టాక్ ఇండస్ట్రీలో ఉంది. హీరో సెంట్రిక్ సినిమాలైనా తన రోల్స్ కు ఇంపార్టెంట్ ఉండాలని దర్శక నిర్మాతలకు చెబుతుంది. ఈ నేపథ్యంలో సాయి పల్లవి నటించిన ‘అమరన్’ సినిమా ఇప్పుడు విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాకు ఒకే చెప్పడానికి ముందే డైరెక్టర్ కు ఓ కండీషన్ పెట్టిందట సాయి పల్లవి. బయోపిక్ సినిమాలలో హీరోయిన్స్‌కి పెద్దగా ప్రాధాన్యం ఉండదు.కాకపోతే సాయి పల్లవి డైరెక్టర్ తో గొడవపడిమరి తన పాత్రకు ప్రాధాన్యముండాలని కండిషన్ పెట్టిందట. ఆ తర్వాతే సినిమాలో నటించేందుకు అంగీకరించాను అని ఇటీవల ప్రమోషన్ కార్యక్రమంలో చెప్పుకొచ్చింది.
సాధారణంగా బయోపిక్ సినిమాల్లో హీరోయిన్లకు ప్రాధాన్యత తక్కువ గా ఉంటుంది.. సినిమా నిడివి లేక మరేదైనా కారణాల వల్ల హీరోయిన్లు నటించిన సీన్లను కట్ చేస్తారు. కానీ ‘అమరన్’ సినిమాలో నటించే ముందు దర్శకుడు రాజ్‌కుమార్ నాకు మాట ఇచ్చారు. మేజర్ ముకుందన్ పాత్రకు ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో నేను చేస్తున్న రెబెక్కా వర్గీస్ పాత్రకు అంతే ప్రాధాన్యముంటుందని డైరెక్టర్ భరోసా ఇచ్చారు అని పేర్కొంది.. అమరవీరుడు మేజర్ ముకుందన్ కథ ఆధారంగా ఈ చిత్రం రూపొందగా, శివకార్తికేయన్ మేజర్ ముకుందన్ పాత్రలో నటించారు. ముకుందన్ భార్య రెబెకా వర్గీస్ పాత్రలో సాయి పల్లవి నటిస్తోంది. కమల్ హాసన్ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు. అక్టోబర్ 31న సినిమా విడుదల కానుంది. సాయి పల్లవి ‘అమరన్’తో పాటు బాలీవుడ్‌లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ‘రామాయణం’లో నటిస్తోంది. తెలుగులో తండేల్ సినిమాలో నటిస్తోంది. అలాగే అమీర్ ఖాన్ కుమారుడి కొత్త సినిమాలో నటించనుంది.