వినోదం

ఇందులో ఉన్న ఇద్ద‌రు స్టార్ హీరోల‌ని గుర్తు ప‌ట్టండి చూద్దాం..!

సోషల్ మీడియాలో సెల‌బ్రిటీల పాత ఫొటోలు నిత్యం హ‌ల్‌చ‌ల్ చేస్తూనే ఉంటాయి. ఇవి చూసి అభిమానులు ఎంత సంతోషిస్తారో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఇటీవ‌ల హీరోయిన్స్ చిన్న‌ప్ప‌టి ఫొటోస్ నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తుండ‌గా, ఇందులో క్యూట్ క్యూట్ గా క‌నిపిస్తూ ఉండే హీరోయిన్స్ ని చూసి అవాక్క‌వుతున్నారు అభిమానులు. తాజాగా, ఓ ఇద్దరు స్టార్‌ హీరోలకు సంబంధించిన ఫొటో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మార‌గా, ఆ ఫొటోలో ఆ ఇద్దరు హీరోలు కాలేజ్‌లో చదువుతున్నప్పటిదిగా తెలుస్తోంది.

ఈ ఫొటోలో ఉన్న ఇద్ద‌రు హీరోల‌ని గ‌మ‌నిస్తే వారు స్టార్ హీరోలు అనే విష‌యాన్ని ఇట్టే గుర్తు ప‌ట్టొచ్చు. ఆ ఫొటోలో ఉన్న హీరోలు మరెవరో కాదు.. తమిళ స్టార్‌ హీరోలు సూర్య, విశాల్‌లు. ఏదో ఫంక్షన్‌లో తమ మిత్రులతో కలిసి కూర్చుని ఉండ‌గా, కుర్చీలో స్టైల్‌గా కూర్చుని ఫొటోకు ఫోజిచ్చారు. పక్కనున్న వారిలో కొంతమంది కెమెరా వైపు చూస్తుంటే మరికొందరు పక్కకు చూస్తూ ఉన్నారు. కాగా, సూర్య ప్రముఖ తమిళ సీనియర్‌ హీరో శివకుమార్‌ కుమారుడన్న సంగతి తెలిసిందే.

have you identified surya in this photo

‘‘నేరుక్కు నేర్‌’’ అనే సినిమాతో సూర్య సినీ రంగ ప్రవేశం చేయ‌గా, బాల దర్శకత్వం వహించిన నంద సినిమాతో సూర్య ఇమేజ్ పెరిగింది. గౌతమ్‌ వాసుదేవ్‌ మీనన్‌ ‘‘ కాక కాక ’’ సినిమాతో స్టార్‌ డమ్‌ తెచ్చుకున్నారు. గజినీ సినిమాతో తెలుగుతో పాటు తమిళంలోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్న సూర్య ఇప్పుడు వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఇక, విశాల్‌ విషయానికి వస్తే.. ఈయన ప్రముఖ వ్యాపారవేత్త, సినిమా నిర్మాత జీకే రెడ్డి కుమారుడు. . అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా విశాల్‌ సినిమా కెరీర్‌ను ప్రారంభించారు. హీరో అర్జున్‌ దగ్గర అసిస్టెంట్‌ డైరెక్టర్‌ పని చేశారు. చెల్లమే సినిమాతో హీరో అయ్యారు. పందెం కోడి సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కి కూడా చాలా ద‌గ్గ‌ర అయ్యారు.

Admin