వినోదం

నూతన్ ప్ర‌సాద్ గురించి ఈ విష‌యం తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..!

టాలీవుడ్ లో ఒక‌ప్పుడు విల‌న్ పాత్ర‌లతో భ‌య‌పెట్టిన అద్భుత‌మైన న‌టుడు నూత‌న్ ప్ర‌సాద్. విల‌న్ గానే కాకుండా క‌మెడియ‌న్ గా కూడా నూత‌న్ ప్ర‌సాద్ ప్రేక్ష‌కుల‌ను న‌వ్వించ‌గ‌లిగారు. ముక్యంగా ఆయ‌న వాయిస్ కు ఎంతో మంది అభిమానులు ఉండ‌గా, సినిమాల్లో రాణించ‌డానికి కూడా ఆయ‌న‌కు వాయిస్ ఎంతో ప్ల‌స్ అయ్యింద‌ని చాలా మంది చెబుతుంటారు. నూత‌న్ ప్ర‌సాద్ దాదాపు 30 సంవ‌త్స‌రాల వర‌కు సినిమాల్లో న‌టించి ఎంతో పాపులారిటీని అందిపుచ్చుకున్నారు. ఆయ‌న ఎంతో మందికి స్పూర్తి.

కెరీర్ లో మొత్తం నాలుగు నంది అవార్డ్ ల‌ను అందుకున్న నూత‌న్ ప్ర‌సాద్.. విల‌న్ గా క‌మెడియ‌న్ గా వంద చిత్రాల‌కు పైగా న‌టించి ప్రేక్ష‌కుల‌ను అల‌రించారు. వ‌రుస సినిమాలో బిజీగా ఉన్న నూత‌న్ ప్ర‌సాద్ జీవితంలో అనుకోకుండా జ‌రిగిన ఒక సంఘ‌ట‌న‌తో ఆయ‌న జీవితం మొత్తాన్ని అంద‌కారంలోకి నెట్టివేసింది. 1989 సంవ‌త్స‌రంలో రాజేంద్ర‌ప్ర‌సాద్ హీరోగా బామ్మ మాట బంగారు బాట అనే సినిమా తెరకెక్క‌గా, షూటింగ్ స‌మ‌యంలో ఓ ప్ర‌మాదం జ‌ర‌గ్గా ఆ ప్రమాదంలో ఆయ‌న తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. షూటింగ్ కారును జేసీబీతో పైకెత్తే స‌న్నివేశాన్ని తెర‌కెక్కిస్తున్న స‌మ‌యంలో కారుకు క‌ట్టిన చైన్ తెగిపోవ‌డంతో నూత‌న్ ప్ర‌సాద్ వెన్నుముక విరిగిపోయింది.

do you know these facts about nutan prasad

HAL లో ఈయన ఉద్యోగం చేసే సమయంలో రంగస్థల నటుడు దర్శకుడు భానుప్రసాద్ పరిచయం ఏర్ప‌డ‌డంతో ఆయ‌న సంస్థ ద్వారా కొన్ని నాటకాల్లో చేశాడు నూతన్ ప్రసాద్. ఉద్యోగం మరోవైపు నాటకాల్లో చేస్తూ వస్తున్న నూతన ప్రసాద్ ,1973 లో తన ఉద్యోగానికి స్వస్తి పలికి ఏఎన్నార్ నటించిన అందాల రాముడు సినిమా ద్వారా ఇండస్ర్టీలోకి వ‌చ్చాడు.. ఆ తర్వాత చాలా సినిమాలు చేసిన కూడా అంతగా గుర్తింపు లభించలేదు. ముత్యాలముగ్గు సినిమాలో రావు గోపాల్ రావు తో పాటుగా ఈయన కూడా విలన్ పాత్ర చేయడంతో మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు అందుకున్నాడు నూత‌న్ ప్ర‌సాద్.

Admin