వినోదం

Nuvvu Naku Nachav : నువ్వు నాకు న‌చ్చావ్ సినిమాను చాలా సార్లే చూసి ఉంటారు.. కానీ ఈ పొర‌పాటును గ‌మ‌నించ‌లేదు..

Nuvvu Naku Nachav : వెంకేట‌ష్ ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కిన సూప‌ర్ హిట్ చిత్రం నువ్వు నాకు న‌చ్చావ్. విందుభోజనం లాంటి అనుభూతిని ఇచ్చిన ఈ సినిమాను చూసిన ప్రతి ఒక్కరూ వెంకటేష్ నటనకి ఎంతలా కనెక్ట్ అయిపోయారో.. త్రివిక్రమ్ మాటల మాయకీ అంతలా కనెక్ట్ అయిపోయారు. అందుకే రెండు దశాబ్దాలు కావస్తున్నా ఈ సినిమా ఇప్పటికీ ప్రేక్షకులకు గిలిగింతలు పెడుతూనే వ‌స్తోంది. సరిగ్గా 2001 సంవత్సరంలో నువ్వు నాకు నచ్చావ్ అనే సినిమా వచ్చింది. ఇప్పటికీ ఈ సినిమా టీవీలో వస్తే వదలకుండా చూసే ప్రేక్షకులు ఉన్నారంటే ఈ సినిమా ప్రేక్షకులకి ఎంతగా నచ్చిందో అర్ధం చేసుకోవచ్చు.

అయితే సినిమాలు అన్నాక కొన్ని పొర‌పాట్లు జ‌ర‌గ‌డం స‌హ‌జం. కానీ వాటిని చాలా మంది గుర్తించ‌లేరు. ఇన్ని సంవ‌త్స‌రాల నుంచి నువ్వు నాకు నచ్చావ్ సినిమాను చూస్తున్నారు కానీ.. అందులో జ‌రిగిన పొర‌పాటును ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రూ గ‌మ‌నించ‌లేదు. ఈ సినిమాలో వెంకీ వాళ్ళ నాన్న స్నేహితుడి ఇంటికి వస్తాడు. వాళ్ల ఇంట్లోనే ఉంటున్న వెంకీకి ఆయ‌న తండ్రి ఉత్త‌రం రాయ‌గా.. హీరోయిన్, ఆమె చెల్లెలు వెంకీ ద‌గ్గ‌ర‌కు వెళ‌తారు. అప్పుడు తన పేరు పింకీ అని, తను లిటిల్ ఫ్లవర్స్ కాన్వెంట్ లో తొమ్మిదో తరగతి చదువుతున్నాన‌ని ప‌రిచ‌యం చేసుకుంటుంది. ఇక పింకీ స్కూల్‌కి వెళ్లే స‌మ‌యంలో చిన్న గొడ‌వ జ‌రుగుతుంది. అప్పుడు వెంకీ వ‌చ్చి రౌడీల భ‌ర‌తం ప‌ట్టి స్కూల్ బ‌స్ లో పింకీని ఎక్కించి పంపిస్తాడు.

have you identified this mistake in nuvvu naku nachav movie

అయితే స్కూల్ బస్ మీద పేరు B.V.B.P SCHOOL అని ఉండ‌గా, పింకీ చెప్పిన స్కూల్ పేరుకి దీనికి అస్స‌లు మ్యాచ్ కాలేదు. షార్ట్ కట్ లో రాశారేమో అనుకుంటే, అక్కడ ఉన్న లెటర్స్ కూడా పేరుకి మ్యాచ్ అయ్యేలా లేవు. ఇలాంటి త‌ప్పులు ఇందులో చాలానే ఉన్నాయి. వాటిల్లో ఇదొక‌టి. అయితే చాలా సినిమాల‌లో మ‌నం ఈ త‌ప్పుల‌ను గ‌మ‌నిస్తూనే ఉంటాం. కానీ పెద్ద‌గా ప‌ట్టించుకోరు. సినిమా న‌చ్చాలేగానీ ఇలాంటి త‌ప్పుల‌ను ప్రేక్ష‌కులు కూడా చూసీ చూడ‌న‌ట్లు వ‌దిలేస్తారు. సినిమాను ఎంజాయ్ చేస్తారు. ఇక‌ ఈ సినిమా 3 గంటల 12 నిమిషాలు నిడివితో 2001 సెప్టెంబర్ 6న ప్రేక్షకుల ముందుకు వచ్చింది . మొదటిగా సినిమా లెంగ్త్ ఎక్కువైపోయిందని అన్నారు . సినిమాలోని సుహాసిని ఎపిసోడ్ మొత్తం డిలీట్ చేయమని అన్నారు. కానీ రవికిశోర్ పట్టుదలతో సినిమాలోని ఒక్క బిట్టును కూడా కట్ చేయలేదు. దీంతో సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యం సాధించింది.

Admin

Recent Posts