చిట్కాలు

మగ వారి రహస్య భాగాలలో వచ్చే ఫంగల్ వ్యాధికి మంచి మందు ఏది?

ఫంగ‌స్ ఇన్‌ఫెక్ష‌న్ అనేది పురుషుల్లో స‌హ‌జంగానే వ‌స్తుంది. స్త్రీల‌లో మూత్రాశ‌య ఇన్‌ఫెక్ష‌న్ ఎంత కామ‌న్‌గా వ‌స్తుందో పురుషుల్లో కూడా ఫంగ‌స్ ఇన్‌ఫెక్ష‌న్ అంతే కామ‌న్ గా వ‌స్తుంది. అయితే పురుషుల్లో జ‌న‌నావ‌య‌వాల భాగాల్లో ఎక్కువ‌గా ఈ ఇన్‌ఫెక్ష‌న్ క‌నిపిస్తుంది. ఇందుకు అనేక కార‌ణాలు ఉంటాయి. జ‌న‌నావ‌య‌వాల‌ను స‌రిగ్గా శుభ్రం చేయ‌క‌పోవ‌డం, స్నానం స‌రిగ్గా చేయ‌క‌పోవ‌డం, శుభ్ర‌త‌ను పాటించ‌క‌పోవ‌డం, త‌ర‌చూ ఇన్ఫెక్ష‌న్లు రావ‌డం వంటి ఇందుకు కార‌ణం అవుతాయి.

జ‌న‌నావ‌య‌వాల వ‌ద్ద వ‌చ్చే ఫంగ‌స్ ఇన్ ఫెక్ష‌న్ త‌గ్గేందుకు కొబ్బ‌రినూనె, టీ ట్రీ ఆయిల్ అద్భుతంగా ప‌నిచేస్తాయి. వీటిని కాస్త క‌లిపి మిశ్ర‌మంగా చేసి రాత్రి పూట రాయ‌వ‌చ్చు. రోజూ ఇలా చేస్తుంటే తప్ప‌క ఫ‌లితం ఉంటుంది. అలాగే ఇంగ్లిష్ మెడిసిన్ కూడా వాడ‌వ‌చ్చు.

how to reduce fungus infection in men

Candid b – cream (ointment ) వారం రోజులు ఇన్ఫెక్షన్ ఉన్న చోట రాయాలి. తగ్గుతుంది. అది తీవ్ర‌త‌రం అయి తగ్గక పొతే fluconazole 150 mg (FLUKA 150)టాబ్లెట్స్ రోజూ రాత్రి పూట ఒకటి చొప్పున 3 రోజులు వాడాలి.

తరువాత తిరిగి రాకుండా candid anti fungal పౌడర్ లేదా shower to shower పౌడర్ లాటివి వాడుతూ ఉండవచ్చు. పరిశుభ్రత పాటిస్తూ ఉండాలి. లో దుస్తులు ఒకసారి మాత్రమే వాడుతూ ఉండాలి. అయితే ఈ మందుల‌ను వైద్యుల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో వాడాలి. కేవ‌లం అవ‌గాహ‌న కోసం మాత్ర‌మే వివ‌రాల‌ను అందించ‌డం జ‌రిగింది.

Admin

Recent Posts