వినోదం

Baahubali : బాహుబ‌లి రెండు సినిమాల్లోనూ ఈ పోలికను మీరు గ‌మ‌నించారా ? ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రూ గుర్తించ‌నేలేదు..!

Baahubali : ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన బాహుబ‌లి రెండు సినిమాలు కూడా ఎంత‌టి ఘ‌న విజ‌యాన్ని సాధించాయో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. బాహుబ‌లి ది బిగినింగ్ జూలై 10, 2015వ తేదీన రిలీజ్ కాగా.. దీనికి రూ.180 కోట్ల బ‌డ్జెట్ అయింది. రూ.650 కోట్ల‌ను రాబ‌ట్టింది. అలాగే బాహుబ‌లి 2 ఏప్రిల్ 28, 2017న రిలీజ్ కాగా.. ఇందుకు రూ.250 కోట్లు ఖ‌ర్చయింది. ఈ మూవీ ఏకంగా రూ.1810 కోట్ల‌ను రాబ‌ట్టింది. భార‌తీయ చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లోనే అత్య‌ధిక డ‌బ్బుల‌ను వ‌సూలు చేసిన చిత్రంగా బాహుబ‌లి 2 రికార్డు సృష్టించింది. ముఖ్యంగా ఇందులో బాహుబ‌లిని క‌ట్ట‌ప్ప ఎందుకు చంపాడు.. అనే విష‌యాన్ని తెలుసుకునేందుకే చాలా మంది సినిమాను చూశారు. క‌నుక‌నే అన్ని క‌లెక్ష‌న్స్ వ‌చ్చాయి.

అయితే బాహుబ‌లి సినిమాను ఎప్పుడు చూసినా ఏదో ఒక విష‌యం మ‌న‌కు తెలుస్తూనే ఉంటుంది. తాజాగా కూడా ఒక విష‌యాన్ని ప‌రిశీలించారు. అదేమిటంటే.. బాహుబ‌లి మొదటి పార్ట్‌లో శివుడు అలియాస్ మ‌హేంద్ర బాహుబ‌లి.. ప్రేమ‌లో ఉంటాడు. మొద‌టి పార్ట్ లో కొడుకు ప్రేమ‌లో ఉండ‌గా.. తండ్రి అమ‌రేంద్ర బాహుబ‌లి కాల‌కేయుల మీద యుద్ధం గెలుస్తాడు.

have you observed this in 2 baahubali movies

ఇక రెండో పార్ట్‌లో అమ‌రేంద్ర బాహుబ‌లి ప్రేమ ఉంటుంది. కానీ చివ‌ర‌కు కొడుకు మ‌హేంద్ర బాహుబ‌లి యుద్ధంలో పాల్గొంటాడు. ఇలా ఈ రెండు సినిమాల‌కు పోలిక ఉంటుంది. ఒక దాంట్లో కొడుకు ప్రేమ‌, తండ్రి యుద్ధం ఉంటాయి. రెండో దాంట్లో తండ్రి ప్రేమ‌, కొడుకు యుద్ధం ఉంటాయి. ఇలా రెండు సినిమాల‌కు ఈ పోలిక‌ను మ‌నం గ‌మ‌నించ‌వ‌చ్చు. చాలా సార్లు బాహుబ‌లి రెండు సినిమాల‌ను చూశాం. కానీ చూసిన‌ప్పుడ‌ల్లా ఏదో ఒక కొత్త విష‌యం మ‌న‌కు అర్థ‌మ‌వుతూ ఉంటుంది. ఇక తాజాగా ఈ విష‌యాన్ని ప‌రిశీలించారు.

Admin

Recent Posts