చిట్కాలు

Banana Peel For Dark Circles : అర‌టిపండు తొక్క‌తో ఇలా చేయండి.. డార్క్ స‌ర్కిల్స్ మాయ‌మ‌వుతాయి..!

Banana Peel For Dark Circles : డార్క్ సర్కిల్స్ తో బాధపడుతున్నారా..? చాలా మంది, ఈరోజుల్లో డార్క్ సర్కిల్స్ తో బాధపడుతున్నారు. డార్క్ సర్కిల్స్ ని పోగొట్టుకోవాలంటే, ఈ ఇంటి చిట్కాలు బాగా ఉపయోగపడతాయి. నిద్ర సరిగ్గా లేకపోవడం, పోషకాహార లోపం వంటి వాటి వలన కూడా కంటి చుట్టూ నల్లని వలయాలు ఏర్పడతాయి. వీటిని తొలగించుకోవడం సులభమే. ఈ చిట్కాలని పాటిస్తే, ఈజీగా డార్క్ సర్కిల్స్ తొలగిపోతాయి. అరటిపండు తొక్క ఇందుకు బాగా పనిచేస్తుంది.

అరటిపండు తొక్కతో బ్లాక్ సర్కిల్స్ ని తొలగించుకోవచ్చు. అరటిపండు తొక్కలో పొటాషియంతో పాటుగా, యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. కంటి చుట్టూ నల్లని వలయాలని దూరం చేస్తుంది అరటిపండు తొక్క. అరటిపండు తొక్కలో కొల్లాజన్ పెంచి రక్తప్రసరణ ని మెరుగుపడేలా చేసే గుణాలు వీటిలో ఉన్నాయి. నల్లని వలయాలని తొలగించుకోవాలని చూస్తున్నట్లయితే, అరటిపండు తొక్కని ఫ్రిజ్లో పెట్టండి.

Banana Peel For Dark Circles use like this for better effect

దాదాపు 15 నుండి 20 నిమిషాల పాటు ఫ్రిజ్లో పెట్టండి. ఆ తర్వాత కంటి చుట్టూ అప్లై చేయండి. తొక్కల ని ముక్కలు చేసి, సుమారు 15 నిమిషాల పాటు, కళ్ళ కింద పెడితే పెడితే చాలా చక్కగా పనిచేస్తుంది. కాసేపు తర్వాత, నీటితో ముఖాన్ని కడిగేసుకోండి. వారానికి రెండు మూడు సార్లు ఇలా చేస్తే చక్కటి ఫలితం ఉంటుంది. అరటిపండు తొక్కని పేస్ట్ కింద చేసుకోండి.

ఇందులోనే కొంచెం నిమ్మరసం, తేనె వేసుకోండి. కళ్ళ కింద ఈ పేస్ట్ ని బాగా అప్లై చేసుకోండి. ఎనిమిది నిమిషాల పాటు అలా వదిలేసి, తర్వాత నీళ్లతో ముఖాన్ని కడిగేసుకోండి. అంతే ఈజీగా వలయాలు తగ్గిపోతాయి. కావాలంటే, ఇది కూడా ట్రై చేయొచ్చు. అరటిపండు తొక్కని పేస్ట్ లాగ చేసి, అందులో కలబంద గుజ్జు కలిపి కంటి కింద అప్లై చేసుకోండి. ఇలా చేయడం వలన డార్క్ సర్కిల్స్ నుండి ఈజీగా బయటపడొచ్చు. ఇలా, చేసి చూడండి. ఇక మీ అందం రెట్టింపు అవుతుంది.

Admin

Recent Posts