వినోదం

Aparichitudu Movie : అప‌రిచితుడు సినిమాలో ఇంత పెద్ద త‌ప్పు ఎలా చేశారు..!

Aparichitudu Movie : ఇండియా గ‌ర్వించ ద‌గ్గ ద‌ర్శ‌కుల‌లో శంక‌ర్ ఒక‌రు అని ఏ మాత్రం సందేహం లేకుండా చెప్ప‌వ‌చ్చు. హీరోల‌తో సంబంధంలేకుండా కేవ‌లం పోస్ట‌ర్‌పైన ఈయ‌న పేరు క‌నబ‌డితే చాలు ప్రేక్ష‌కులు థియేట‌ర్‌ల‌కు ప‌రుగులు తీస్తుంటారు. శంక‌ర్ త‌న‌ సినిమాల్లో ఎంట‌ర్టైన‌మెంట్‌తో పాటు ఒక మంచి సోష‌ల్ మేసేజ్ కూడా ఇస్తుంటాడు. ఈయ‌న తెర‌కెక్కించిన సూప‌ర్ హిట్ చిత్రాల్లో ‘అప‌రిచితుడు’ ఒక‌టి. నిర్ల‌క్ష్యం, లేజినెస్‌, అవినీతి , క‌ల్తీ వ‌ల‌న దేశం ఎలా అభివృద్ధి చెంద‌కుండా అలానే ఉండిపోతుందో అనే కాన్సెప్ట్‌తో శంక‌ర్ ఈ మూవీని ఎంతో అద్భుతంగా తెర‌కెక్కించాడు.

అప‌రిచితుడు చిత్రంలోశంకర్ స్క్రీన్‌ప్లే గాని, టేకింగ్ గాని నెక్స్ట్ లెవ‌ల్లో ఉంటాయి. మూడు విభిన్న పాత్ర‌ల్లో విక్ర‌మ్ న‌ట‌న వ‌ర్ణ‌నాతీతం అనే చెప్పాలి.. ఈ సినిమాతోనే విక్ర‌మ్‌కు తెలుగులో మంచి మార్కెట్ ఏర్ప‌డింది. అస‌లు ఈ సినిమా క‌థ‌ను శంక‌ర్ మొద‌ట ర‌జినికాంత్‌కు వినిపించాడ‌ట‌. కానీ ర‌జిని ఈ క‌థ‌ను రిజెక్ట్ చేయ‌డంతో విక్ర‌మ్‌ వ‌ద్ద‌కు అప‌రిచితుడు స్క్రిప్ట్ వెళ్ళింది. విక్ర‌మ్ కెరీర్‌లోనే ఈ చిత్రం ఓ మైలురాయిలా నిలిచిపోయింది. స‌దా హీరోయిన్ గా న‌టించిన ఈ చిత్రాన్ని ఆస్కార్ ర‌విచంద్ర‌న్ భారీ బడ్జెట్‌తో నిర్మించాడు. చిత్రంలో మూడు పాత్ర‌ల‌లో ఒక‌టి రాము…మ‌రొక‌టి రెమో..మూడో పాత్ర అప‌రిచితుడు.

have you observed this mistake in aparichitudu movie

రాము ఎక్క‌డ అన్యాయం జ‌రిగినా చూస్తూ ఉండ‌లేడు. కానీ చాలా సౌమ్యుడు రూల్స్ గురించి మాట్లాడుతుంటాడు. ఇక రెమో ల‌వర్ బాయ్…అంతే కాకుండా అప‌రిచితుడు అన్యాయం చేసే వాళ్ల‌ను ఎదిరిస్తూ వాళ్ల అంతు చూస్తాడు. అయితే రాము సినిమాలో చాలా రూల్స్ మాట్లాడుతూ చిన్న త‌ప్పు కూడా అస్స‌లు భ‌రించ‌డు. లాయ‌ర్ కావ‌డంతో ఓ సారి బైక్ వైర్ తెగితేనే ఆ కంపెనీని కోర్టుకు లాగుతాడు. కానీ సినిమాలో రాము బండి న‌డిపేట‌ప్పుడు మాత్రం హెల్మెట్ పెట్టుకోడు. మ‌రి అంత రూల్స్ మాట్లాడే రాము హెల్మెట్ పెట్టుకోకుండా డ్రైవ్ చేయ‌డం ఎంత వ‌ర‌కు క‌రెక్ట్ అనే విష‌యంపై నెటిజన్స్ త‌ప్పు ప‌డుతున్నారు.

Admin

Recent Posts