వినోదం

పవన్ కళ్యాణ్ బాలు సినిమా హీరోయిన్ గుర్తుందా ? ఇప్పుడెలా ఉందంటే ?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సినిమాలకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వరుస పెట్టి సినిమాలు పూర్తి చేస్తున్నాడు. పవన్ ప్రస్తుతం హరిహర వీరమల్లు చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నారు. పవన్ నటించిన సినిమాల రిజల్ట్ ఎలా ఉన్నప్పటికీ అభిమానులు ఆ సినిమాలని ఆదరిస్తూ ఉంటారు. ఆయనకి ఉన్న క్రేజ్ అటువంటిది. అయితే ఇండస్ట్రీలో ఉన్న హిట్ డైరెక్టర్ – హీరో కాంబినేషన్లలో పవన్ కళ్యాణ్ – కరుణాకరన్ కాంబినేషన్ ఒకటి. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన తొలిప్రేమ చిత్రం ఇండస్ట్రీలో వచ్చిన ప్రేమ కథల్లో బెస్ట్ మూవీగా నిలిచిపోయింది.

ఈ చిత్రం తర్వాత వీరిద్దరి కంపెనీషన్లో వచ్చిన మరో సినిమా బాలు. ఈ చిత్రంలో పవర్ స్టార్ సరసన ఇద్దరు హీరోయిన్స్ నటించారు. వీరిలో ఒకరు శ్రియ, మరొకరు నేహా ఓబెరాయ్. శ్రియ ఇప్పుడు ఎలా ఉందో అందరికీ తెలిసిందే. కానీ నేహా ఎలా ఉంది అనేది చాలామందికి తెలియకపోవచ్చు. నేహా ఓబెరాయ్ బాలీవుడ్ ప్రముఖ నిర్మాత ధరమ్ ఒబెరాయ్ కూతురు. ధరమ్ ఓబెరాయ్ హిందీలో కాబిల్, షూట్ అవుట్ వంటి హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించారు. అయితే బాలు సినిమా తర్వాత నేహా తెలుగులో సినిమాలు చేయకపోయినప్పటికీ తెలుగు సినిమా ప్రేక్షకులకు బాలు సినిమా హీరోయిన్ గా బాగా గుర్తుండిపోయింది. ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న నేహా జగపతిబాబు బ్రహ్మాస్త్రం చిత్రంలో నటించింది.

how is balu actress neha oberai right now

కానీ ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఆ తర్వాత నేహా తెలుగులో కనిపించలేదు. అడపదడప బాలీవుడ్ లో సినిమాలు చేసింది. ఇక 2010లో ప్రముఖ వజ్రాల వ్యాపారి విశాల్ షాను పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యింది. ఆ తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమై ప్రస్తుతం తన భర్తతో వ్యాపార కార్యకలాపాలు చూసుకుంటుంది.

అలాగే నేహా ప్రస్తుతం ఇంటర్నేషనల్ ఫిలిం అండ్ టెలివిజన్ క్లబ్ ఆఫ్ ఏషియన్ అకాడమీలో ఒక మెంబర్ గా వ్యవహరిస్తుంది. తాజాగా ఈ అమ్మడికి సంబంధించిన లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలలో నేహాను చూసినవారు షాక్ అవుతున్నారు.

Admin

Recent Posts