వినోదం

మోహ‌న్‌లాల్ న‌టించిన ఎంపురాన్ మూవీ ఎలా ఉంది..?

మోహన్ లాల్ హీరోగా నటించిన పొలిటికల్ థ్రిల్లర్ లూసీఫర్ మూవీ ఎంత పెద్ద సక్సెస్ అయిందో తెలిసిందే కదా. ఇపుడా మూవీకి సీక్వెల్ గా ఎంపురాన్ – లూసీఫర్ 2 గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా లూసీఫర్ మాదిరి థ్రిల్ చేసిందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం.. దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమార్ లూసీఫర్ కథను ఎంతో గ్రిస్పింగ్ గా పకడ్బందీగా పొలిటికల్ గా మెప్పించాడు. ఇక‌ రెండో పార్ట్ ను ఎంపురాన్ అనే టైటిల్ తో తెరకెక్కించాడు. ఇక్కడ లూసీఫర్ అంటే దండించే వాడు. స్వర్గం నుంచి బహిష్కరించిన వాడు అనే అర్ధం ఉంటే… ఎంపురాన్ అంటే.. దైవం కంటే తక్కువ.. రాజు కంటే ఎక్కువ అనే అర్ధంలో ఈ సినిమాను తెరకెక్కించాడు. ముఖ్యంగా ఈ సినిమాలో స్టార్టింగ్ లో మైనారిటీ వర్గం వాళ్లపై మెజారిటీ వర్గం వాళ్లు దౌర్జన్యంతో హీరో కుటుంబాన్ని దారుణంగా చంపివేయబడతారు.

ఏదో కావాలనే ఇరికించి ఓ మెజారిటీ వర్గం వారిని శత్రువులుగా.. మైనారిటీ వర్గాన్ని బాధితులుగా చూపించాడు. మన దేశంలో బెంగాల్, కశ్మీర్, కేరళలో మెజారిటీ వర్గీయులుగా చెప్పుకుంటున్న వాళ్లు మైనారిటీలుగా ఎన్నో ఇబ్బందులను ఫేస్ చేస్తున్నారు. అలాంటివి చూపించకుండా.. కావాలనే కథకు అవసరం లేకపోయినా.. మెజారిటీ అంటే హిందూ వర్గాన్నికావాలనే కించపరిచేలా ఈ సీన్స్ రాసుకున్నట్టు కనిపిస్తుంది.

how is mohan lal empuraan movie

మోహన్ లాల్ .. స్టీఫెన్ నెడుంపల్లి అలియాస్ అబ్రహం ఖురేషీ పాత్రలో మెప్పించాడు. తాను ఎంత గొప్ప నటుడో ఈ సినిమాతో ప్రూవ్ అయింది. పృథ్వీరాజ్ సుకుమారన్ ఉన్నంతలో తన హీరోయిజం చూపించాడు. జితిన్ రామ్ దాస్ పాత్రలో నటించిన టోవినో థామస్ తన పాత్ర‌కు న్యాయం చేశాడు. నెగిటివ్ పాత్రలో ఒదిగిపోయాడు. మంజు వారియర్ తన పరిధి మేరకు నటించింది. ముఖ్యంగా ఈ సినిమాలో విలన్ గా నటించిన అఖండ శక్తి మోర్చా నాయకుడు బాబా బజరంగీ అలియాస్ బలరాజ్ పాత్రలో అభిమన్యు సింగ్ జీవించాడు. ఈయన క్యారెక్టర్ తో హీరో ఎలివేషన్స్ పండాయి. మిగిలిన నటీనటులు తమ పరిధి మేరకు నటించారు.

మోహన్ లాల్ నటన, నిర్మాణ విలువలు, ఎలివేషన్ సీన్స్ ఈ సినిమాకు హైలైట్ కాగా.. కథ, స్లో నేరేషన్, లాజిక్ లేని సీన్స్, సినిమా నిడివి ఈ సినిమాకు మైన‌స్ పాయింట్స్‌. పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్ మూవీ చూడాల‌ని ఉంటే ఈ మూవీని వీక్షించ‌వ‌చ్చు.

Admin

Recent Posts