శామ్‌సంగ్ మరియు ఆపిల్ స్మార్ట్‌ఫోన్ లు 2021 నుండి ఛార్జర్ ను ఫోన్ బాక్స్ లో ఇవ్వటం నిలిపివేశాయి . ఎందుకు అంటే ఇందుకు కొన్ని ముఖ్య కారణాలు ఉన్నాయి . శామ్‌సంగ్ మరియు ఆపిల్ స్మార్ట్‌ఫోన్ లు వారి కొన్ని మోడల్స్ లో హెడ్ ఫోన్స్ ఇవ్వటం ఆపేసాయి , ఇవి ఆపేసాక వినియోగదారులు హెడ్ ఫోన్స్ కావాలనుకునే వారు డబ్బులు వెచ్చించి కొనుకోవాల్సి వస్తుంది . ఇదే పద్దతిలో చార్జర్ ని ఇవ్వటం ఆపేశారు. ఇలా చేసినా కూడా చార్జర్ తప్పనిసరిగా అవసరం కాబట్టి కొనక తప్పదు . కానీ ఇక్కడే వారు ఒక వెసులుబాటు కల్పిస్తున్నారు . ఫోన్ కొనే దగ్గరే ఈ ఛార్జర్స్ ని అందుబాటులో ఉంచుతున్నారు . అమెజాన్ , ఫ్లిప్కార్ట్ లో సజెస్టెడ్ లో వస్తుంది, ఇలా కొనుక్కునే అవకాశ ధోరణిలోకి వినియోగదారుని తీసుకెళ్లే అవకాశాలు ఉన్నాయి.
వీటికి చాల కారణాలు ఉన్నాయి . వినియోగదారులు తక్కువ సమయంలోనే వారి ఫోన్లను మారుస్తున్నారు . ఆపిల్ ఫోన్ వినియోగదారులు ఎక్కువ మొత్తంలో ప్రతి సంవత్సరం ఫోన్ ని మారుస్తారు . వారి పాత ఫోన్ ఎక్స్చేంజి లో ఇచ్చేసి కొత్త ఫోన్ తీసుకుంటే ఆ చార్జర్ అలానే ఉండి పోద్ది .మరల కొత్త ఫోన్ లో చార్జర్ రాకున్నా వాటిని వాడుకోవచ్చు . ఇలా చేస్తే ప్లాస్టిక్ వినియోగం తగ్గుద్ధి. అదే విధంగా వినియోగదారులు ఫోన్లో అనవసరంగా వచ్చే చార్జర్ కి చెల్లించాల్సిన అవసరం లేదు అని వెల్లడిస్తున్నారు .
అయితే కంపెనీలకు కూడా ఒక వెసులు బాటు ఉంది. ఛార్జర్స్ లను ప్రత్యేకంగా అమ్మి లాభాలను గడించవచ్చు. ఛార్జర్స్ లను బాక్స్ నుండి తొలగించి అక్కడ కూడా కొద్దీ మొత్తంలో మిగిల్చుకోవచ్చు . ఆపిల్ మొబైల్ సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ మీద రీసెర్స్ అండ్ డెవలప్మెంట్ స్టార్ చేసిన అది వేల కోట్ల ఖర్చు , దీనిని ఛార్జర్స్ లను ఎక్కువ మొత్తంలో అమ్మి రిటర్న్స్ ని రాబట్టొచ్చు . శామ్‌సంగ్ కూడా సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ అండ్ గ్రఫైన్ బ్యాటరీ రీసెర్స్ అండ్ డెవలప్మెంట్ లో ఖర్చు చేస్తుంది , ఒకవేళ ఇది విజయవంతం అయితే కొత్తరం బ్యాటరీ లను లాంచ్ చేస్తుంది , ఈ ఖర్చు ని రాబట్టాలి అంటే కూడా ఇలా చేయాల్సి ఉంటుంది . ఇవే కాకుండా ఇలా మార్కెట్ ని పెంపొందిస్తే ఇక్కడ కూడా లాభాలను ఆర్జించొచ్చు . ఎలా అంటే ఆపిల్ ఎయిర్ పాడ్స్, శామ్‌సంగ్ గెలక్సీ బడ్స్ కొత్త ప్రాడక్ట్స్ ని వేలలో రేటు పెట్టి అమ్మేయొచ్చు . అందువల్లే ఆయా కంపెనీలు చార్జర్ లను ఫోన్‌లతో ఇవ్వడం మానేశాయి.