వినోదం

విక్ర‌మ్ న‌టించిన వీర ధీర శూర మూవీ రివ్యూ.. సినిమా ఎలా ఉంది..?

<p style&equals;"text-align&colon; justify&semi;">విక్రమ్‌ హీరోగా నటించిన వీర ధీర శూర మూవీ ఎట్టకేలకు రిలీజ్‌ అయ్యింది&period; మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం&period; విలక్షణ నటుడు విక్రమ్‌ నటుడిగా నిరూపించుకుంటున్నారు&period; కానీ కమర్షియల్‌ హిట్‌ పడటం లేదు&period; ఇటీవల చాలా సినిమాలు డిజప్పాయింట్‌ చేస్తున్నాయి&period; చివరగా చేసిన తంగలాన్‌ కూడా డిజప్పాయింట్‌ చేసింది&period; ఈ నేపథ్యంలో ఇప్పుడు ఫ్యాన్స్ కోసం కమర్షియల్‌ మూవీ వీర ధీర శూర చేశాడు&period; దీనికి ఎస్‌ యూ అరుణ్‌ కుమార్‌ దర్శకత్వం వహించారు&period; ఇందులో విక్రమ్‌కి జోడీగా దుస్సరా విజయన్‌ నటించగా&comma; ఎస్‌ జే సూర్య&comma; సూరజ్‌&comma; 30 ఇయర్స్ పృథ్వీ కీలక పాత్రలు పోషించారు&period; హెచ్‌ ఆర్‌ పిక్చర్స్ పతాకంపై రియా షిబు నిర్మించిన ఈ చిత్రాన్ని తెలుగులో ఎన్వీ ప్రసాద్‌ విడుదల చేశారు&period; అయితే పలు ఫైనాన్స్ సమస్యల కారణంగా ఈ మూవీ మార్చి 27à°¨ రిలీజ్‌ కాలేదు&period; అన్ని సమస్యలు సెట్‌ చేసుకుని అదే రోజు ఈవినింగ్‌ విడుదలయ్యింది&period; మరి సినిమా ఎలా ఉంది&quest; విక్రమ్‌ కి ఈ సారైనా హిట్‌ దొరికిందా&quest; అనేది చూద్దాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇటీవల à°°à°¾ అండ్‌ రస్టిక్‌ మూవీస్‌ బాగా ఆడుతున్నాయి&period; మాస్‌ కమర్షియల్‌ అంశాలను జోడించి ఇంట్రెస్టింగ్‌గా&comma; ఎంగేజింగ్‌గా&comma; ట్విస్ట్ లు&comma; టర్న్ లు&comma; ఎలివేషన్లతో తెరకెక్కిస్తే మంచి ఆదరణ పొందుతున్నాయి&period; ఇప్పుడు ఇలాంటి మూవీస్‌ ట్రెండ్‌ నడుస్తుంది&period; అందులో భాగంగా విక్రమ్‌ కూడా ఫ్యాన్స్ ని ఖుషీ చేసేందుకు&comma; తాను కమ్‌ బాక్‌ కోసం వీర ధీర శూర మూవీలో నటించారు&period; ఈ మూవీ కార్తి ఖైదీని తలపిస్తుంది&period; కాళి పాత్రలో విక్రమ్‌ అదరగొట్టాడు&period; తనదైన యాక్టింగ్‌తో మెప్పించారు&period; కాళి పాత్రలో జీవించారు&period; పాత్రని రక్తికట్టించాడు&period; అదే సమయంలో డీసెంట్‌గా బిహేవ్‌ చేస్తూ ఆకట్టుకున్నారు&period; కావాల్సిన ఎలివేషన్లకు ప్రయారిటీ ఇవ్వలేదు&period; కానీ నటుడిగా ఆయన దుమ్ములేపాడని చెప్పొచ్చు&period; ఆయన భార్య పాత్రలో దుసరా విజయన్‌ సైతం అంతే సహజంగా చేసింది&period; అందరి దృష్టిని ఆకర్షించింది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-82151 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;04&sol;veera-dheera-sooran&period;jpg" alt&equals;"how is vikram veera dheera sooran movie review " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కన్నన్‌ పాత్రలో సూరజ్‌ బాగా చేశాడు&period; మరో హైలైట్‌ అయ్యే పాత్ర అయనది&period; ఇరగదీశాడు&period; ఇక పెద్దాయన రవి పాత్రలో పృథ్వీరాజ్‌ నటన కూడా ఆకట్టుకుంది&period; మనకు ఆయన కమెడియన్‌గా తెలుసు&period; దీంతో విలన్‌గా చూడలేకపోతున్నాం&period; ఆ పాత్రకి ఇంకా ఎలివేషన్లు&comma; బాక్‌ స్టోరీ ఉంటే బాగుండేది&period; ఎస్పీగా ఎస్‌ జే సూర్య సినిమాకి మరో పెద్ద అసెట్‌&period; ఆయన చేసిన రచ్చ వేరే లెవల్‌ అని చెప్పొచ్చు&period; ఇందులో ఎస్పీగా ఎత్తులకు పై ఎత్తులు వేసే వ్యక్తిగా సూర్య దుమ్ములేపాడు&period; పాత్రకి ప్రాణం పోశాడు&period; హీరోని డామినేట్‌ చేసే పాత్రలో ఆకట్టుకున్నాడు&period; క్లైమాక్స్ లో ఆయన పాత్రని డమ్మీ చేశారనిపిస్తుంది&period; మిగిలిన పాత్రలు ఓకే అనిపించాయని చెప్పాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">టెక్నీకల్‌గా సినిమా బాగుంది&period; ముఖ్యంగా తేని ఈశ్వర్‌ కెమెరా వర్క్ వేరే లెవల్‌&period; బాగా షూట్‌ చేశారు&period; ప్రసన్న జీకే ఎడిటింగ్‌ ఇంకా కత్తెరకు పనిచెప్పాల్సింది&period; సినిమా చాలా స్లోగా రన్‌ అవుతుంది&period; ఆ విషయంలో కొంత కేర్ తీసుకోవాల్సింది&period; జీవీ ప్రకాష్‌ మ్యూజిక్‌ స్పెషల్‌ ఎట్రాక్షన్‌&period; అతి లౌడ్‌గా వెళ్లకుండా థ్రిల్లర్‌ మిక్స్ చేసి ఆయన ఇచ్చిన మ్యూజిక్‌ అదిరిపోయింది&period; దర్శకుడు అరుణ్‌ ఈ మూవీని రెండు పార్ట్ లుగా తీసుకురావాలనుకున్నారు&period; కానీ ఇప్పుడు రెండో పార్ట్ ని ముందుగా విడుదల చేశారు&period; ఫస్ట్ పార్ట్ ఈ మూవీ రిలీజ్‌ అయితే ఉంటుంది&period; దీంతో ఇందులో కథ సరిగా చెప్పలేదు&period; అదే కన్‌ఫ్యూజన్‌కి కారణమవుతుంది&period; ఈ విషయంలో మరింత గ్రిప్పింగ్‌గా కథనాన్ని రాసుకుంటే బాగుంటుంది&period; ఆడియెన్స్ సహనాన్ని పరీక్షించే వీర ధీర శూర&period; తెలుగు ఆడియెన్స్ ని ఆకట్టుకోవడం కష్టమే అంటున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts