వైద్య విజ్ఞానం

పొగ తాగ‌డం మానేస్తే బ‌రువు పెరుగుతార‌ట‌.. అలా ఎందుకు జ‌రుగుతుందంటే..?

సిగరెట్ తాగటం నిలిపేస్తున్నారా? బరువుపెరుగుతారు జాగ్రత్త! ఈ అధిక బరువుకు కారణం మీ ఆకలి. ఇప్పటివరకు సిగరెట్ కారణంగా చచ్చిపోయిన ఆకలి ఒక్కసారి విజృంభిస్తుంది. మీకు తెలియకుండానే తినేయటం మొదలెడతారు. అంతే కాదు, గతంలో సిగరెట్ పై ఆడే వేళ్లు ఇక ఆహారంపై ఆడుతూంటాయి. ఈ రెండు కారణాలుగా తినడం అధికమవుతుంది. సిగరెట్ తాగే వారు ఏదో ఒకటి వేళ్ళతో నిరంతరం పట్టుకోడానికి ప్రయత్నిస్తూంటారు. మరి అటువంటపుడు ఆరోగ్యకరమైన వేళ్ళతో పట్టుకునే ఆహారం ఆపిల్, కేరట్ మొదలైనవి పట్టుకునే అలవాటు చేసుకోవాలి లేదా కనీసం వేళ్ళ మధ్య పెన్ లేదా పెన్సిల్ వంటిది పెట్టుకోవాలని మైండ్ మళ్ళించాలని ఆహార నిపుణులు సూచిస్తున్నారు.

ఇక ఆహారం తీసుకోడానికి సిగరెట్ మానేసినవారు సమయాలు ఆచరించాలట. మూడు సార్లు సుష్టుగా భోజనం చేసే కన్నా దానిని నాలుగు లేదా అయిదుసార్లుగా తినాలట. బ్రేక్ ఫాస్ట్ ఎట్టిపరిస్ధితిలో మానరాదట. తినే ఆహారంలో పీచు వుంటే బరువెక్కకుండా వుంటుంది. ఆకలి తక్కువ వుంటుంది. యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా వుండే ఆరెంజ్, గ్రేప్, స్ట్రాబెర్రీలు తీసుకుంటూ సిగరెట్ మానేసిన కారణంగా ఏర్పడే డీ హైడ్రేషన్ తగ్గాలంటే….రోజుకు 8 నుండి 10 గ్లాసుల నీరు తాగాలి.

if you stop smoking you will gain weight know the reason

నిద్ర తగినంత లేకుంటే మరోమారు సిగరెట్ కు అలవాటు పడే ప్రమాదముందట. కనుక నిద్రించాలి. కాఫీ తాగితే మరోమారు అది సిగరెట్ లోని నికోటిన్ కావాలంటుందట. అందుకని కాఫీ మానేయాలి. సిగరెట్ మానేశామనే ఒత్తిడి పోగొట్టుకోవాలంటే, మంచి హార్మోన్లు అయిన ఎండార్ఫిన్లను పొందటానికి రోజూ కొద్దిపాటి వ్యాయామమేదైనా చేయాలి. దీనివలన మీ మెటబాలిజం పెరగటమే కాక, శారీరకంగా మంచి ఫిట్ నెస్ పొందుతారని నిపుణుల సూచన.

Admin

Recent Posts