మెగాస్టార్ చిరంజీవి, నటసింహ నందమూరి బాలకృష్ణ.. ఈ ఇద్దరు హీరోలకి తెలుగు రాష్ట్రాలలో మాస్ ఫాలోయింగ్ ఏ రేంజ్ లో ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఇండస్ట్రీలో ఒక హీరో సినిమాతో మరో హీరో సినిమా పోటీ పడడం అనేది ఎప్పటినుంచో ఉంది. అందులో బాలకృష్ణ – చిరంజీవి సినిమాల పోటీ అంటే అభిమానులకు ఆ కిక్కే వేరు. మెగాస్టార్ చిరంజీవి, నటసింహ నందమూరి బాలకృష్ణల సినిమాలు సంక్రాంతి సమయంలో పోటీ పడ్డాయి. ఆ సినిమాల వివరాలు ఇప్పుడు చూద్దాం. 1985: సంక్రాంతికి చిరంజీవి చట్టంతో పోరాటం చిత్రంతో, బాలకృష్ణ ఆత్మబలం చిత్రంతో పోటీపడ్డారు. అయితే ఈ రెండు సినిమాలు ఆడలేదు. కమర్షియల్ గా చట్టంతో పోరాటం గుడ్డిలో మెల్ల అన్నట్టు నిలబడింది.
1987: ఈ ఏడాది సంక్రాంతి దొంగ మొగుడుతో చిరంజీవి, భార్గవ రాముడుతో బాలయ్య పోటీపడ్డారు. అయితే విన్నర్ గా చిరంజీవి దొంగ మొగుడు నిలిచింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది. 1988: ఈ ఏడాది సంక్రాంతికి మంచి దొంగతో చిరంజీవి, బాలకృష్ణ ఇన్స్పెక్టర్ ప్రతాప్ తో పోటీ పడ్డారు. ఈసారి వీరిద్దరి సినిమాలు సక్సెస్ అందుకున్నాయి. 1997: ఈ ఏడాది చిరంజీవి హిట్లర్ తో, బాలకృష్ణ పెద్దన్నయ్య తో పోటీపడ్డారు. ఈసారి కూడా ఇద్దరు సక్సెస్ సాధించారు. ఈ రెండు సినిమాలు బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి. 1999: ఈ ఏడాది సంక్రాంతి చిరంజీవి స్నేహం కోసం తో, బాలకృష్ణ సమరసింహారెడ్డి తో పోటీపడ్డారు. స్నేహం కోసం పెద్దగా ఆడలేదు. బాలయ్య సమరసింహారెడ్డి మాత్రం ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.
2000: ఈ ఏడాది సంక్రాంతికి చిరంజీవి అన్నయ్య చిత్రంతో, బాలకృష్ణ వంశోద్ధారకుడు చిత్రంతో పోటీపడ్డారు. అన్నయ్య సినిమా హిట్ అయింది. వంశోద్ధారకుడు ఫ్లాప్ గా మిగిలింది. 2001: ఈ ఏడాది సంక్రాంతి కి చిరంజీవి మృగరాజు చిత్రంతో, బాలకృష్ణ నరసింహనాయుడు చిత్రంతో పోటీ పడ్డారు. నరసింహనాయుడు ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. మృగరాజు డిజాస్టర్ అయ్యింది. 2004: ఈ ఏడాది సంక్రాంతికి చిరంజీవి అంజి చిత్రంతో, బాలకృష్ణ లక్ష్మీనరసింహ చిత్రంతో పోటీపడ్డారు. అంజి డిజాస్టర్ గా మిగిలింది. లక్ష్మీనరసింహ సూపర్ హిట్ గా నిలిచింది. 2017: ఈ ఏడాది సంక్రాంతికి చిరంజీవి ఖైదీ నెంబర్ 150 చిత్రంతో, బాలకృష్ణ గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రంతో పోటీపడ్డారు. ఖైదీ నెంబర్ 150 బ్లాక్ బస్టర్ అయింది. గౌతమీపుత్ర శాతకర్ణి కూడా డీసెంట్ హిట్ అనిపించింది.