వినోదం

శోభ‌న్ బాబు ఒట్టి డబ్బు మనిషా ? డ‌బ్బు విష‌యంలో ఆయ‌న ఎలా ఉండేవారు..?

డబ్బు మనిషి కాదు. డబ్బు విలువ తెలిసిన మనిషి శోభన్ బాబు అని చెప్ప‌వ‌చ్చు. డబ్బులేని వ్యక్తికి ఈ సమాజం ఎటువంటి గౌరవం ఇస్తుందో తెలిసిన వ్యక్తి. అతడు సినిమాలో నటించమని మురళీ మోహన్ అడిగితే తిరస్కరించారు. నాకు ఇప్పుడు వయసు పైబడుతున్నది. నేను సినిమాల నుండి రిటైర్ అయ్యాను. నేను నటించలేనని చెప్పారు. నన్ను ప్రజలు అందాల నటుడిగానే చూశారు. ఇప్పుడు మరలా నటించలేనని అన్నారట. blank cheque ఆఫర్ వచ్చినా వద్దన్నారు. డబ్బు మనిషి అయితే, డబ్బే ప్రధానం అయితే ఆ సినిమాలో నాజర్ నటించిన పాత్రలో శోభన్ బాబు నటించేవారు కదా! అంటే…. తను తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి వున్నారు. విపరీతంగా దానధర్మాలు, ఖర్చులు చేసి, వృద్ధ్యాప్యంలో చిన్న చిన్న వేషాలకోసం స్టూడియోల దగ్గర పడిగాపులు పడ్డ నాగయ్య, రాజనాల, కాంతారావుల‌ దుస్థితిని ఆయన ప్రత్యక్షంగా చూశారు.

ఆయన మనకెవరికీ నేను డబ్బు మనిషిని అని చెప్పలేదు. ఒక వ్యక్తి తన సంపాదనను ఖర్చు పెట్టే తత్వం పూర్తిగా వ్యక్తిగతం. ఆయన real estate మీద పెట్టుబడి పెట్టారు. సినిమా నటుడిగా రాణించారు.సంపాదించారు. ఆయన హుందాగానే జీవించారు. మంచి ఆర్థిక ప్రణాళిక వున్న వ్యక్తి. తన అభిమానులు, సినీ పరిశ్రమలో కొందరికి సహాయం చేసినట్టు తెలుస్తున్నది.తన డ్రైవర్, వంటవాళ్ళకు సహాయం చేశారు. గుప్తదానాలు కూడా వుండవచ్చు. ఈ కాలంలో చాలా రంగాల్లో వున్న వ్యక్తులు, ఇతరులు ఎంత సంపాదిస్తున్నా ఇతరులకు సహాయపడకపోగా…. వేరే వారిని ఆర్థికంగా మోసం చేయడం, అక్రమ సంపాదన ఇతరుల, తోబుట్టువుల ఆస్తులను దోచుకోవడం, కలుపుకోవడం, కబ్జా, IP పెట్టడం, కష్టపడకుండా సంపాదించాలనే ఆలోచన, దురాశ, అత్యాశతో వున్నారు.

how shobhan babu behaved in money matters

ఆయన ఎవరినీ మోసం చేయలేదు. ఎవరి ఆస్తులను దోచుకోలేదు. కబ్జా చేయలేదు.ఎవరికీ డబ్బులు ఎగ్గొట్టలేదు. తను సినిమా రంగంలో, real estate లో నష్టపోతే మనం ఆదుకుంటామా….! వీరాభిమన్యు సినిమా తర్వాత సరిగా వేషాలు రాలేదు. తన శ్రీమతిని తీసుకుని మద్రాస్ నుంచి తిరిగి నందిగామ వచ్చేద్దామనుకున్నారు. ఆయన కష్టపడ్డారు. కష్టాన్నే నమ్ముకున్న disciplined person. మంచి ఆర్థిక క్రమశిక్షణ కలిగిన ముక్కుసూటి మనిషి.

Admin

Recent Posts