వినోదం

తమన్నా మాజీ బాయ్ ఫ్రెండ్ విజయ్ వర్మ గురించి ఈ విషయాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. 2007లో హ్యాపీడేస్ చిత్రం ద్వారా ఇండస్ట్రీలో మంచి గుర్తింపుని తెచ్చుకున్న తమన్నా అంతకంటే ముందు శ్రీ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయం అయింది. హ్యాపీడేస్ సినిమాలో ఎలా ఉందో ఇప్పటికీ అలాగే ఉంది. అందం, అభినయంతో టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలుగుతోంది తమన్నా. అయితే గత కొద్ది రోజులుగా తమన్నా పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వినిపించిన విషయం తెలిసిందే. ఓ ప్రముఖ వ్యాపారవేత్తను పెళ్లి చేసుకోబోతున్నట్లు అనేక మీడియా సంస్థలలో వార్తలు వినిపించాయి. అయితే ఈ వార్తలను ఖండించింది తమన్నా. అలాంటి సందర్భం వస్తే వేడుకలాగా అందరికీ తెలిసేలా చేసుకుంటానని చెప్పింది.

ఇక తాజాగా సోషల్ మీడియాలో మరోసారి తమన్నా – నటుడు విజయ్ వర్మ ల పేర్లు మార్మోగుతున్నాయి. బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో తమన్నా ప్రేమలో పడ‌గా వారిద్ద‌రూ విడిపోయారు అంటూ అక్కడి మీడియా కోడై కూస్తుంది. గ‌తంలో కొత్త సంవత్సరం వేడుకలలో భాగంగా గోవాకు వెళ్ళిన తమన్నా బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో జంటగా కనిపించేసరికి అప్ప‌ట్లో ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యపోయారు. అంతేకాదు పబ్లిక్ గానే వీరిద్దరూ ముద్దాడుకున్నారని ఒక వీడియో కూడా వైరల్ అయింది. దీంతో వీరిద్దరూ అప్ప‌టి నుంచి డేటింగ్ లో ఉన్నారని న్యూస్ వ‌చ్చింది. అయితే వారు గుడ్ న్యూస్ చెప్పబోతున్నారు అని కూడా వార్తలు వినిపించాయి. కానీ ఏమైందో తెలియ‌దు ఇద్ద‌రూ విడిపోయిన‌ట్లు కూడా వార్త‌లు వైర‌ల్ అవుతున్నాయి.

interesting facts about tamannah ex boy friend vijay verma

ఇకపోతే నటుడు విజయ్ వర్మ విజయానికి వస్తే.. విజయ్ వర్మ నటుడిగా బాలీవుడ్ లో సెటిల్ అయినప్పటికీ.. ఇతను హైదరాబాద్ లో పుట్టి పెరిగాడు. థియేటర్ ఆర్టిస్ట్ కోర్సులో చేరి ఆ తర్వాత పూణేకి వెళ్లి అక్కడ కూడా ఫిలిం అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో యాక్టింగ్ కోర్స్ నేర్చుకొని దానిలో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశాడు. విజయ్ వర్మ మొట్టమొదటిసారిగా షోర్ అని షార్ట్ ఫిలిం ద్వారా నటన రంగంలోకి అడుగు పెట్టారు. ఆ తర్వాత చిట్టగాన్ అనే మూవీతో బాలీవుడ్ డెబ్యూ చేశారు. ఇక ఈయన చేసిన సినిమాలలో బాగా గుర్తింపు తెచ్చి పెట్టిన సినిమా మాత్రం పింక్ సినిమా. అక్కడి నుండి బాలీవుడ్ లో గల్లీ బాయ్, సూపర్ 30, భాగీ 3, డార్లింగ్స్ సినిమాలతో పాపులర్ అయ్యాడు. బాలీవుడ్ లోనే కాకుండా తెలుగులో కూడా నాని హీరోగా నటించిన ఎంసీఏ మూవీ లో విలన్ గా నటించి మెప్పించాడు. అయితే విజ‌య్ వ‌ర్మ వ్యాపార‌వేత్త క‌నుక అత‌డికి కొన్ని వేల కోట్ల ఆస్తులు కూడా ఉన్న‌ట్లు స‌మాచారం.

Admin

Recent Posts