దర్శక దిగ్గజం రాజమౌళి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ లో అయినా బాలీవుడ్ లో అయినా రాజమౌళి పేరు ఇప్పుడు మారు మోగిపోతుంది. రాఘవేంద్రరావు శిష్యుడిగా స్టూడెంట్ నెంబర్ 1 చిత్రం ద్వారా సినీ రంగ ప్రవేశం చేసిన రాజమౌళి సినిమా రంగానికి ముందు టీవీ ధారావాహికలకు పని చేశాడు. అలాంటి రాజమౌళి ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమలోని ప్రముఖ అగ్ర దర్శకులలో ఒకడిగా మారారు. ఇప్పటివరకు ఒక్క పరాజయం కూడా చవిచూడకపోవడం రాజమౌళి ప్రత్యేకత.
రాజమౌళి సినిమా తీశారంటే ఆ సినిమా హిట్ గ్యారెంటీ అనే విధంగా ప్రేక్షకులు నమ్ముతారు. స్టూడెంట్ నెంబర్ 1 నుండి ఆర్ఆర్ఆర్ వరకు ఒక్కో సినిమా ఒక్కో రేంజ్ లో రాజమౌళి ఇమేజ్ ని అమాంతం పెంచేశాయి. ఇక ఇప్పుడు రాజమౌళి మహేష్ బాబు తో ఓ సినిమా తీయబోతున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే శాంతినివాసం సీరియల్ కి దర్శకత్వం వహించిన జక్కన్న దర్శకుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే దర్శకుడిగానే కాకుండా కొన్ని సినిమాలలో జక్కన్న అతిధి పాత్రలలో కూడా కనిపించారు. ఆ సినిమాలు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం..
2004లో రాజమౌళి దర్శకత్వంలో నితిన్ – జెనీలియా హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన ఈ చిత్రంలో నల్ల బాలు ( వేణుమాధవ్) అనుచరుడిగా కనిపించారు రాజమౌళి. 2008లో ఎన్వీఎస్ ఆదిత్య దర్శకత్వంలో రాహుల్ – సోనాల్ చౌహాన్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన రెయిన్ బో అనే చిత్రంలో రాజమౌళి అతిధి పాత్రలో కనిపించారు. 2009 జూలై 31న విడుదలైన మగధీర చిత్రంలో సినిమా చివరన వచ్చే అనగనగనగా పాటలో కనిపించారు రాజమౌళి. జక్కన్న దర్శకత్వంలో వచ్చిన బాహుబలి ది బిగినింగ్ చిత్రంలో వైన్ సెల్లర్ గా కనిపించారు. 2019లో విరించి వర్మ దర్శకత్వంలో నాచురల్ స్టార్ నాని, అను ఇమ్మాన్యూయల్ హీరో హీరోయిన్లు గా తెరకెక్కిన మజ్ను చిత్రంలో రాజమౌళి కనిపించారు. జక్కన్న తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రంలోని చివరలో వచ్చే నెత్తురు మరిగితే ఎత్తర జెండా అనే పాటలో కనిపించారు.