వినోదం

ఒక‌ప్పుడు టాప్ హీరోయిన్‌.. ఇప్పుడు కుంభ మేళాలో స‌న్యాసినిగా మారింది..

సినిమా ఇండ‌స్ట్రీలో హీరోయిన్‌గా న‌టీమ‌ణులు కొంత‌కాల‌మే ఉంటారు. త‌రువాత వారి స్థానాన్ని ఇంకొక‌రు భ‌ర్తీ చేస్తారు. ఇది నిరంత‌రం జ‌రుగుతున్న ప్ర‌క్రియే. అయితే ఒక హీరోయిన్ ప‌ని అయిపోయాక ఆమెకు ఇండ‌స్ట్రీలో అమ్మ‌, అక్క‌, చెల్లి, అత్త లాంటి పాత్ర‌ల‌ను ఇస్తారు. ఇక కొంద‌రు సినిమా ఇండ‌స్ట్రీకి గుడ్ బై చెప్పి వ్యాపారాలు చేసుకోవ‌డ‌మో లేక సీరియ‌ల్స్‌లో న‌టించ‌డ‌మో చేస్తున్నారు. అయితే బాలీవుడ్ హాట్ హీరోయిన్ మ‌మ‌తా కుల‌క‌ర్ణి మాత్రం ఏకంగా స‌న్యాసినిగా మారి అంద‌రికీ షాక్ ఇచ్చింది. తాజాగా ఆమె స‌న్యాసం పుచ్చుకున్న వీడియో సోషల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

ఒక‌ప్ప‌టి ప్ర‌ముఖ బాలీవుడ్ హీరోయిన్ మ‌మ‌తా కుల‌క‌ర్ణి తాజాగా జరుగుతున్న కుంభ మేళాలో భాగంగా స‌న్యాసం పుచ్చుకుంది. తోటి మ‌హిళా సన్యాసులు ఆమెకు స‌న్యాసం ఇచ్చారు. స‌న్యాసం పుచ్చుకున్న అనంత‌రం ఆమె త‌న పేరును కూడా మార్చుకున్నారు. మాతా మాయి మ‌మ‌తా నంద గిరిగా ఆమెను ప్ర‌స్తుతం వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అయితే సన్యాసం పుచ్చుకునే స‌మ‌యంలో ఆమె కాస్త భావోద్వేగానికి లోన‌య్యారు. దీంతో ఆ స‌మ‌యంలో తీసిన వీడియో వైర‌ల్‌గా మారింది.

Mamta Kulkarni became saint officially took sanyas

ఇక మ‌మ‌తా కుల‌క‌ర్ణి చివ‌రిసారిగా 2002లో క‌భీ తుమ్ క‌భీ హు అనే సినిమాలో న‌టించింది. త‌రువాత సినిమాల‌కు గుడ్ బై చెప్పింది. కొన్నేళ్లుగా ఆమె ఎవ‌రికీ క‌నిపించ‌లేదు. ఆమె దుబాయ్‌కి మ‌కాం మార్చి ఆధ్యాత్మిక‌త వైపు అడుగులు వేసింది. చివ‌రిగా స‌న్యాసం పుచ్చుకుంది. అయితే ఆమె స‌న్యాసం పుచ్చుకోవ‌డంపై నెటిజ‌న్లు ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు.

Admin

Recent Posts